కలికాలం అంటే ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" కల్యంతే కలహం కుర్వన్ యశ్మిన్ కలిః " - " కలికాలం ఎప్పుడూ కలహాలతో గడుస్తూ ఉంటుంది" అని భావం.

కలి ప్రవేశిస్తే అంతా " రివర్స్ " లో ఉంటుంది. తల్లిదండ్రులు సరిగ్గానే ఉన్నారా అని పిల్లలు, గురువులు సరిగ్గానే ఉన్నారా అని శిష్యులు నిర్ణయం చేస్తారు.

మొన్న సామవేదం షణ్ముఖశర్మగారి ప్రవచనం వినడం జరిగింది. 

ధర్మాన్ని 4 పాదాలు ( పాళ్ళు ) చేస్తే సత్యయుగంలో 4 పాదాలు ఉంటాయి. త్రేతా అంటే 3- ఆ యుగంలో ధర్మం 3 పాదాలు అధర్మం 1 పాదం ఉంటాయి. ద్వాపర అంటే 2, ఆ యుగంలో చెరి 2 పాదాలు ఉంటే కలియుగంలో ధర్మం 1 పాదం , అధర్మం 3 పాదాలు ఉంటాయి. ఇక్కడ తెలుసుకోవలసినది కలిపురుషుడు 4 యుగాల్లోనూ ఉంటాడు. త్రేతాయుగంలో రావణాదులలోనూ, ద్వాపర యుగంలో దుర్యోధనాదుల్లోనూ, ఇప్పటి కలియుగంలో అత్యధిక జనుల్లోనూ చేరాడు అంతే. కలియుగం లో కూడా ధర్మపరులు ఉంటారు కాని వారు తక్కువగా ఉంటారు. అలాంటివారు ఉండబట్టే సమయానికి వానలూ అవీ పడి పంటలు పండుతున్నాయని అనుకోవచ్చు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంతో ధర్మబద్ధమైన సత్యయుగంలో కూడా కలిపురుషుడు ఉన్నాడు. నలదమయంతుల కధ అందరం చదివినదే. దానిలో నలుడిలో కలి ప్రవేశించడం గూర్చి చదివాం.

మనచుట్టూ వైరస్ అన్నివేళలా ఉంటుందిట. మనలో శక్తి తగ్గినప్పుడు శరీరంలోపలికి ప్రవేశిస్తుందిట. అలాగే కలి కూడా అనుకోవచ్చు.

ఈ విషయాలు జ్ఞప్తిలో ఉంచుకుని ఏ చిన్న అవకాశం దొరికినా ఎవరిలోనైనా కలిప్రవేశం జరిగే అవకాశం ఉన్నందున ధర్మబద్ధమైన జీవితం గడిపేందుకు తగిన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అందరూ. ఆ ప్రయత్నాలు అంత తేలికకాదుకనుక అందరూ అమ్మవారి పాదాలని ఆశ్రయిస్తే అన్ని విషయాలు ఆవిడే చూసుకుంటుంది. బిడ్డల ఉన్నతే ఆవిడకి కావలసినది కనుక. " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి " అన్నారు శంకరులు శ్రీదేవీ అపరాధక్షమా స్తోత్రం లో . " కొడుకు చెడ్డవాడు అవచ్చుకాని తల్లి చెడ్డది ఎప్పుడూ అవదు " అని. 

సర్వే జనాః సుఖినో భవంతు 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ