ఉత్తములు అని ఎలా తెలుస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" నహి కశ్చిత్ క్షణమపి
జాతు తిష్ఠతి అకర్మకృత్,
కార్యతే హి అవశః కర్మ
సర్వః ప్రకృతిజైః గుణైః "
- భ.గీత 3:5
" జీవుడు కర్మ చెయ్యకుండా క్షణం కూడా ఉండలేడు. అది ప్రకృతిపరంగా వచ్చిన గుణాలు ( సత్వ తమో రజోగుణాలు ) కారణంగా " అని పరమాత్మ సెలవిచ్చారు గీతలో.
హనుమ " జ్ఞానినాం అగ్రగణ్యం ". " ఋగ్వేదంలో శిక్షణ లేనివారు, యజుర్వేదంలో ధారణ లేనివారు, సామవేదంలో పాండిత్యం లేనివారు ఇలా మంగళకరంగా హృదయానికి హత్తుకునేలా మాట్లాడలేరు " అంటారు రాముడు హనుమ మాటలు విన్నాక లక్ష్మణుడితో.
మరి ప్రశాంతంగా ఋష్యమూక పర్వతంమీద ఎక్కడో ఒకచోట కూర్చుని ధ్యానం/తపస్సు చేసుకోక సీతమ్మను వెదకడం దేనికి, అంత శ్రమ పడడం దేనికి?.
" ఉత్తమానాం స్వభావోయం
పరదుఃఖ అసహిష్ణుత,
మయం దుఃఖంచ సంప్రాప్తం
మన్యతే అన్యస్యవార్యతే "
వ్యాసర్షి భారతంలో అంటారు " ఉత్తములు ఇతరుల దుఃఖాన్ని తట్టుకోలేరు. ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడానికి వారు దుఃఖపడతారు " అని.
హనుమ ఉత్తములు, సత్వగుణ సంపన్నులు. నాకెందుకు అని కూర్చోలేరు. పైగా రాముడివంటి మూర్తీభవించిన ధర్మమూర్తి బాధపడుతూంటే చూస్తూ ఎలా కూర్చుంటారు. అందుకే అంతలా కష్టపడ్డారు, శ్రీరాముడి అభిమానాన్ని చూరగొన్నారు.
అది ఉత్తముల స్వభావం.
ఎంత అద్భుతం మన సనాతనధర్మం.
ఈరోజు వసంతోత్సవం. శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment