ప్రకృతి భారతీయం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
భారతీయ సంప్రదాయం శాస్త్రవిజ్ఞానగని. చెన్నైలో తిరువాన్మియూర్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఔషధీశ్వరస్వామి గుడి ఉంది. పేరే ఆశ్చర్యంగా ఉంది కదా.
దీని స్థలపురాణం ఏమిటంటే ఇక్కడ శివుడు అగస్త్యమహర్షికి మొక్కలు మూలికల ఉపయోగాలు, అవి నయంచేసే వ్యాధుల గురించి విపులంగా తెలియచేసారుట. శివుడు ఔషధీశ్వరస్వామిగా వెలిసారుట ఇక్కడ.
ఈ స్వామిని వాల్మీకి మహర్షి పూజించడంతో ఈ ప్రదేశానికి తిరువాల్మీకియూర్ అని పేరు వచ్చిందిట. ఆపేరు మార్పులు చెంది తిరువాన్మియూర్ అయిందని తెలుస్తూంది.
చెట్లని పుట్టల్ని పూజిస్తారేమిటో భారతీయులు అంటూంటారు చాలామంది. మనం చేసేది పూజలు కాదు, కృతజ్ఞత. ఎవరయినా మనకు ఉపయోగపడే చిన్నవిషయం చెబితేనే " ధన్యవాదములు " అంటాము. మరి ఇన్ని ఇస్తూన్న ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదా?. మనకు ఏది కావాలన్నా అన్నీ ప్రకృతే కదా ఇస్తూన్నది.
రామాయణం యుద్ధకాండలో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి రామలక్ష్మణులతో సహా అందరూ మూర్ఛపోతారు. జాంబవంతుడు హనుమని కైలాసపర్వతం అవతలనున్న ప్రదేశం నుంచి మృతసంజీవని, సువర్ణకరణి వంటి 4 రకాల మూలికలు వెంటనే తీసుకురమ్మంటారు. మూలికలు ఇక్కడా ఉంటాయి కాని ప్రస్తుత సమస్య ఇక్కడ మూలికలతో తీరదు. అంటే రకరకాల సమస్యలకు రకరకాల మూలికలు. ఎంత అద్భుత విషయం.
ప్రకృతిలో ఏదీ నిరుపయోగమయినది లేదు. కొన్నిటి ఉపయోగాలు మనకు తెలియవు అంతే. ఇంకోలా ఆలోచిస్తే మనకు తెలియకుండా చేసారు అనుకోవచ్చు.
మనం వేల సంవత్సరాల క్రితం నుంచే ఉపయోగిస్తూన్న పసుపు, అవిశగింజలు, కలబంద కుంకుడుగింజలు మొ.గు వాటిని శరీరారోగ్యం కోసం వాడడం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు ఇతరులు.
మిరపకాయలు మన పంట కాదు. మిరియాలు వాడేవారు మన పూర్వీకులు. పంచదార మనది కాదు. బెల్లం, తేనె వాడేవారు. కాఫీ మనది కాదు. మజ్జిగ త్రాగేవారు, అతిధులకు ఇచ్చేవారు. మిరపకాయలు అధికరక్తపోటును తెచ్చింది. పంచదార మధుమేహంని తీసుకువచ్చింది. కాఫీ మిగతా అన్ని రోగాలనూ తీసుకువచ్చింది.
జాతిని రోగగ్రస్తులుగానూ, నిర్వీర్యులుగానూ చేసేసారు విదేశీపాలకులు.
మళ్ళీ మన ఆయుర్వేదానికి పూర్వపు శోభ వైభవం త్వరలో వస్తాయని ఆశిద్దాం. మన వంతు కృషి మనం చేద్దాం.
హమారా సనాతనధర్మ మహాన్ - సూర్య.
శుభం భూయాత్
Excellent
ReplyDeletePl mention ur name n mobile number in future responses. Tq
ReplyDelete