ఉపవాసాలు అవీ చేయవచ్చా? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" నాత్యశ్నతస్తు యోగో2స్తి
న చైకాన్తమనశ్నతః,
నా చాతిస్వప్నశీలస్య
జాగ్రతో నైవ చార్జున "
- భ.గీత 6:16
" అతిగా తినేవారికి అస్సలు తినని వారికి, అతిగా నిద్రపోయే వారికి అస్సలు నిద్రపోని వారికి యోగాభ్యాసము అంటదు/పనికిరాదు " అన్నారు పరమాత్మ.
యోగాభ్యాసము దేనికి. మనస్సు నిలకడగా అంటే అలలులేని సముద్రంలా నిశ్చలంగా ఉండడానికి. అప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి, ప్రశాంతంగా ఉంటుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.
అందుకని మితాహారం తీసుకోవాలన్నారు. అది ఎలాగో కూడా చెప్పారు. ఉదరాన్ని 4 భాగాలు చేసి 2 భాగాలు ఘనపదార్ధం ( అన్నం మొ.గునవి ) తో నింపి ఒకభాగం ద్రవంతో నింపమన్నారు. ఒకభాగం ఖాళీగా ఉంచితే మితాహారం తీసుకున్నట్లుగా భావించాలి. ఖాళీకడుపుతో అసలు చెయ్యకూడదన్నారు.
ఎంత అద్భుతంగా విపులంగా చెప్పారో చూడండి. ఖాళీకడుపు అయినా పొట్టనిండుగా ఉన్నా నిద్ర రావడానికి అవకాశముంది. మరి ఎత్తుపీటమీద కూర్చుంటే నిద్రమత్తులో క్రింద పడితే ఏమవుతుందో అందరికీ తెలుసు. అలాగే క్రింద కూర్చోవడంకూడా కష్టమే కదా. అందుకని అంత ఎత్తు పల్లంకాని మెత్తని ఆసనం మీద కూర్చుని ధ్యానం చేసుకోనున్నారు.
ఇక్కడ గ్రహించవలసినది శక్తి, అలవాటు లేనివారు " ఉపవాసాలు, నోములు, వ్రతాలు " అవీ చేయకూడదు, చేయనక్కరలేదు అని. అప్పుడు మనస్సు మన అధీనంలో ఉండి ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో చేస్తున్నారని " పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు " అలాంటి పనులు చేయనక్కరలేదు, చేయొద్దని పరమాత్మ స్పష్టంగా చెప్పారు.
ఏతత్ సర్వం శ్రీ శ్రీకృష్ణపరమాత్మార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏
ReplyDeletePl give ur name n mobile number
ReplyDelete