వ్యాధులలోనూ అమ్మవారు కూర్చుని ఉంటారా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏

" త్రిస్థా " - అమ్మవారి అద్భుతనామాలు. శ్రీలలితాసహస్రరహస్యనామాలలో ఇది 874 వ నామం.

" త్రిస్థా " అన్నది ఒక అద్భుతనామం. త్రిస్థా అంటే మూడింటిలోనూ ఉన్నది అని అర్ధం. ఆ 3 ఏమిటి అని భాష్యం చెప్పడానికి పూజ్యులు శ్రీభాస్కరరాయులవారు " మార్కండేయపురాణం " లోని శ్లోకాన్ని యధాతధంగా తీసుకున్నారు. ఆ శ్లోకంలో సరస్వతీదేవి ని స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు - " 3 వేదాలు ( ఋగ్ యజుర్ సామ ), 3 వర్గాలు (ధర్మ అర్ధ కామ), 3 లోకాలు ( స్వర్గ మర్త్య పాతాళ ), 3 విద్యలు ( సాంఖ్య యోగ వేదాంత ), 3 జ్యోతులు ( సూర్య చంద్ర అగ్ని ), 3 గుణాలు ( సత్వ రజో తమో ), 3 దోషాలు ( వాత పిత్త కఫ ), 3 ఆశ్రమాలు ( బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం ), 3 శబ్దాలు ( అ ఉ మ - ఓం ), 3 కాలాలు ( పగలు సంధ్య రాత్రి ), 3 అవస్థలు ( జాగృతి స్వప్న సుషుప్తి ) - అలా అన్నింటిలోనూ అమ్మవారు ఉన్నారు అని తెలియచేసేలా " త్రిస్థా " అనే నామంతో పూజిస్తున్నారు. 

ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏమిటంటే " వాత పిత్త కఫ " లలో అంటే వ్యాధులలోనూ అమ్మవారు కూర్చుని ఉంటారు అర్ధమవుతూంది. వ్యాధి ఒకరకంగా వరం.

విష్ణుసహస్రంలో " అన్నం అన్నాద ఏవచ " అన్న నామాలు ఉన్నాయి. " అన్నం ఇచ్చేది ఆయనే, అన్నం ఆయనే, జఠరాగ్ని రూపంగా అన్నాన్ని స్వీకరించేదీ ఆయనే " అని తెలియచేస్తాయి ఆ నామాలు. అంటే అంతటా ఆయన చైతన్యమే అని తెలుసుకోవాలి. 

భ.గీతలో పరమాత్మ అర్జునుడితో అంటారు " నేను నీతో సరదాగా మాట్లాడుతూ తిరుగుతున్నానని నన్ను ఇతరమానవుల్లా అనుకోకు. ఆ వాసనలేవీ ( లక్షణాలు ) నాకు ఉండవు " అని.

మన " ధర్మబద్ధమైన " కోరికలు అన్నీ తీరేలా అనుగ్రహించమని ""త్రిస్థా " రూపిణిని కోరుకుందాం. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ