మన ఋషుల విద్వత్తు అనంతం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" ఋషివ్యవస్థ " అంటే పరమాత్మ ఇచ్చిన సందేశాన్ని/విజ్ఞానాన్ని లోకానికి అందించే ఏర్పాటు. మన ఋషులు ఏదిచేసినా ఏదిచెప్పినా లోకకళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకునే. 

అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయంలో జాన్ ఎం మాల్విలె ( John M Malville ) అనే కాస్మాలజీ ( కాస్మిక్ ఎనర్జీ ) ప్రొఫెసర్ ఉండేవారు. చాలా పరిశోధనలు చేసారు. ఒక స్నేహితుడు శ్రీనాధుడు వ్రాసిన " కాశీఖండం " గ్రంధాన్ని ఓసారి చదవమన్నారు ఈయన్ని. ఆ గ్రంధంలోని కాశీ చుట్టూ ఉన్న ద్వాదశాదిత్యుల గుడులగురించిన సమాచారాన్ని చదివి ఆశ్చర్యపోయారు ఈయన. అది నిజమా, అంతటి విజ్ఞానం సాధ్యమా, కల్పితమైనా అంత అద్భుతమా అని ఆలోచనచేసి ఉండలేక కాశీకి బయలుదేరారు.

తన పరికరాలన్నింటినీ అంటే జిపిఎస్, కంపాస్,రాడార్లు తీసుకుని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని భారతీయ సాంస్కృతిక శాఖ ప్రొఫెసర్ అయిన " రాణా పిబి సింగ్ " ని కలిసారు.

అమెరికా ఆయన చెప్పిన విషయాలు, వచ్చినపని విని సింగుగారు కూడా ఆశ్చర్యపోయి ఆయన ఉన్నంతవరకూ ఆయనతోనే ఉండి ఆయనకు అన్ని విధాలా తోడ్పాటును అందించారు.

కాశీఖండంలో ఉన్న విషయాలు - కాశీకి చుట్టూ నిర్ణీతప్రదేశాల్లో 12 సూర్యదేవాలయాలు ఉన్నాయి. అవి కాశీకి ఎంతెంతదూరంలో ఉన్నాయి, సూర్యకిరణాలు ఏసమయంలో ఏకోణంలో ఏవేడితో ఏశక్తితో వాటిమీద పడతాయో స్పష్టంగా ఉన్నాయి కాశీఖండంలో. సూర్యుడు ఒక్కోమాసం ఒక్కోరాశిలో ఉంటారని మనకు తెలుసు. ఉదా: పుష్యమాసంలో మకరరాశిలో ప్రవేశించడం చదివాం,మకరసంక్రాంతి జరుపుకుంటున్నాం.

సూర్యుడు ఒక్కోరాశిలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కో గుడిలో ఆ ప్రత్యేకత కనిపిస్తుంది.

ఈయన తనపరికరాలతో ఆ గ్రంధంలో ఉన్న విషయాలను పరిశీలిస్తూ ఒక్కో గుడిని దర్శించి ఆశ్చర్యపోవడం జరిగింది.

వీరు ఈగుడులమీద ఎన్నో పరిశోధనాపత్రాలను విడుదలచేసి చివరలో అన్నది " ఎంతటి అద్భుతవిజ్ఞానము, మానవమాత్రులకు సాధ్యంకాదిది. ఋషులు తమ దివ్యచక్షువులతో దర్శించి తెలుసుకున్నవో లేక ధ్యానంలో కూర్చుని గ్రహించిన దైవదత్త విషయాలో ఇవన్నీను. ఏమాత్రం సందేహమే లేదు " అని.

అదీ మన ఋషులవిజ్ఞానం, మన సనాతనధర్మ విశిష్టిత. దీనికి సాటి ఇంకొకటి లేదు, ఉండదు, రాదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ