మన ఆర్షవిజ్ఞానం అనంతం, అద్భుతం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" సహస్ర సూర్యతయా భాంతి " - వేదం

 అంతరిక్షంలో వేలసూర్యులు ప్రకాశిస్తున్నారు

" నో2దేతి నో2స్తమేతి "  - వేదం 

సూర్యుడు అస్తమించడు, ఉదయించడు.


" య ఆధ్రాయ చకమానాయ..

........మర్దితారం న విందతే " 

           - వేదం ( భిక్షుసూక్తం )

" అన్నదాతగా ఉండి ఆహారం అవసరమైన బలహీనులకు సహాయార్ధం వచ్చే దీనులకూ పెట్టకుండాఎవరైతే తింటారో వారు కనీసం అనునయించేవారు కూడా లేక కష్టపడుతారు ".

వేల సంవత్సరాల క్రితమే ఇటువంటి అద్భుత విజ్ఞానం, భూతదయ గురించిన విషయాలపై అవగాహన చూస్తేనే సనాతనధర్మం గొప్పదనం ఏమిటో తెలిసిపోతూంది.

నిన్నటి వరకూ భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పిన మతాలు సనాతనధర్మం కన్నా గొప్పవి ఎలా అనుకోవాలి?

ఆర్యభట్టు ప్రతిపాదించిన సూర్యసిద్ధాంతం భూమి తనచుట్టూ తిరగడం వంటి విషయాలను నిజమేనని చెప్పిన కోపర్నికస్ వంటివారు ఆవిషయాలను బహిరంగంగా చెప్పడానికీ కూడా సాహసించలేదు, మూఢనమ్మకాలకు బానిసలయిన మతాధికారులకు భయపడి. అటువంటివారు నేడు సనాతనధర్మం మూఢత్వం అంటున్నారు.

అద్భుతమైన అంతరిక్ష విజ్ఞానం ని ప్రపంచానికి మొదట ఇచ్చినది సనాతనధర్మం.

చదువుకోనివాడు ఏదయినా మాట్లాడితే పాపం అమాయకుడు అనుకోవచ్చు. పెద్ద పెద్ద చదువులు చదివి పరిశోధనలు చేసినవారు కూడా అలా గాలికి కొట్టుకుపోతే ఎలా?.

ప్రపంచ శాంతికి సనాతనధర్మం తప్ప వేరే దిక్కు లేదు. కిం సంశయం?.

" భాస్కరాయ విద్మహే  మహాద్యుతికరాయ

  ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ "

హమారా సనాతనధర్మ మహాన్ - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ