సరిగ్గా కనిపించడం లేదంటే దోషం కన్నుది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" దీపో నేత్రాతురస్యేవ 

  ప్రతికూలాతి మే దృఢం "

రాముడు సీతమ్మతో అగ్నిప్రవేశానికి ముందర ఇలా అంటారు " కంటి రోగికి దీపంలాగ నువ్వు ప్రతికూలురాలవు " అని. కంటి రోగికి దీపం సరిగ్గా కనబడదు.‌ తప్పు ఎవరిది దీపందా?. కాదు కదా. అలాగే సీతమ్మ దీపం వంటిది, తప్పు ఆవిడిది కాదు. ఒకవేళ ఎవరయినా సీతమ్మ గురించి తప్పుగా మాట్లాడితే అలా మాట్లాడేవారిది తప్పు. రాజు ఎదుటివాడికి ఎప్పుడూ అలా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఈ పరీక్ష అంటారు. 

ఎంతటి అద్భుత ఉపమానం. ఇప్పుడు జరుగుతూన్న విషయం చూద్దాం.‌

కొందరు కుహనా మేధావులు " సనాతనధర్మం విషతుల్యం. సమాజాన్ని పాడుచేస్తూంది. దాన్ని గొయ్యి తీసి భూమిలో ప్రాతిపెట్టాలి " అంటూ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు. 

దీపం వంటి సనాతనధర్మంని కొందరు మానసిక రోగులు తప్పు పడితే దోషం ఎవరిది. సనాతనధర్మంని సరిగా అర్థం చేసుకోక/చేసుకోలేక, దాన్ని పాటించడం వలన కలిగే అత్యుత్తమ ఫలితాలు తెలుసుకోలేక కొందరు దానిని తప్పు పడితే నష్టం ఎవరికి.

అటుకులరుచి ఎద్దుకు, పన్నీటి సువాసన పందికి తెలియదు అని సామెత. దోషం ఎవరిది.

ఇటువంటి వారు ఎప్పుడూ ఉంటారు అని రామాయణం కాలంలోనే ఊహించి చక్కటి అటువంటి ఉపమానం చెప్పడం ఎంత అద్భుతం.

అది మన " ఆర్షధర్మం " విశిష్టత.

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ