బిందువే మూలం దేనికయినా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" బైందవాసనా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 905వ నామం.

" బైందవాసానా " అంటే బిందువులో ఆసీనురాలయి ఉంటుంది అని. కనుబొమలమధ్యభాగానికి కొద్దిగా పైన బిందురూపంలో ఉంటుంది అమ్మవారు.

శ్రీచక్రంలో నవావరణాల మధ్యన బిందురూపంలో ఉంటుంది అమ్మవారు.

ఇది అత్యద్భుతనామం. ఏదైనా బిందువు నుంచే మొదలవుతుంది. ప్రధమస్పందన బిందువే, అక్కడనుంచే అన్నీ వచ్చాయి. బిందువునుంచే కదా ఏరూపమయినా వచ్చేది. ఏబొమ్మ వెయ్యాలన్నా అన్నీ బిందుసమూహమే కదా. 

ఒక బొమ్మ వేద్దామనుకుంటే ముందర ఒక బిందువు పెడతారు, దానినుంచే చిత్రమంతా వస్తుంది. జీవుల శరీరం కూడా బిందువునుంచే మొదలవుతుంది. బిందువుల సంఖ్య పెరిగి పెరిగి శరీరంగా తయారవుతుంది. చిన్నపిల్లవాడికి ఉన్న చర్మమే పెరిగే కొలదీ సాగుతూ వస్తుంది. కొత్తగా ఎక్కడనుంచీ రాదు. అదే చర్మం ఎంతో అద్భుతంగా పెరుగుతుంది, లోపమేమీ లేకుండా. ఎంత అద్భుత సృష్టి.

ఏపదార్ధం తీసుకున్నా అది అతిసూక్ష్మపదార్ధాల సమూహమే కదా. ఆ సూక్ష్మపదార్ధమే అమ్మవారు/చైతన్యం

" యచ్ఛాపి సర్వభూతానాం 

  బీజం తదహమర్జున " 

                 - భ.గీత 10:39. సర్వభూతములకు మూలకారణమయిన " బీజం " నేనే అన్నారు పరమాత్మ. 

కెన్నెత్ ఫోర్డ్ ( హైడ్రోజన్ బాంబ్ ప్రోజెక్ట్ - 1952 సభ్యుడు, ప్రస్తుతవయస్సు 96 ) అనే శాస్త్రజ్ఞుడు అన్నారు " ఎంత చిన్న పదార్ధాన్ని కనుక్కున్నా దానిలో ఎనర్జీ/చైతన్యం ఉంటూంది, ఎంతటి అద్భుత విషయం " అని. అమ్మవారు ( చైతన్యం ) అంత సూక్ష్మరూపంలో ఉంటుంది అని మన ఋషులు తెలియచేయడం ఎంతటి అద్భుతవిషయం.

అదీ మన సనాతనధర్మ విశిష్టత. దానిని కాపాడుకోవడం అందరి బాధ్యత.

అమృతేశ్వరిని అందరినీ అనుగ్రహించమని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ