అహల్య మహా పతివ్రత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" అహల్యా ద్రౌపదీ సీతా 

  తారా మండోదరీ తధా 

  పంచకన్యాం స్మరేత్ నిత్యం 

  మహాపాతక నాశనం "

( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు )

ఈ ఐదుగురిని రోజూ తలుచుకుంటే మహాపాతకాలు నశిస్తాయని స్మృతివాక్యం.

వీరిలో అహల్య, సీత, మండోదరి, తార రామాయణకాలంవారు. ద్రౌపది మహాభారతకాలంవారు. 

ఆశ్చర్యకరంగా ఈ అయిదుగురు స్త్రీల జీవితాలు ఒడిదుడుకులతో కూడినవే. ఎవరి జీవితమూ కూడా అనసూయ, అరుంధతి మొ.గు వారి జీవితాలలాగా సాఫీగా సాగలేదు. అందరూ ఒడిదుడుకులను తట్టుకుని దృఢంగా నిలిచి, పూజలందుకుంటున్నారు.

ఈ రోజు అహల్య గురించి చదువుదాం.

అద్భుత సౌందర్యవతిని సృష్టించాలని బ్రహ్మగారు అనుకుని అహల్యని సృష్టించారు. ఇంద్రుడుతో సహా ఎందరో ఈమెను వివాహం చేసుకోవాలనుకున్నారు. అందుకని బ్రహ్మగారు భూప్రదక్షిణం చేసి మొదట వచ్చినవారికి అహల్యనిచ్చి వివాహం చేస్తాననడంతో అందరూ బయలుదేరారు. అదే సమయానికి గౌతమమహర్షి రావడం, పరీక్ష గురించి వినడం, గోవు దూడ చుట్టూ ప్రదక్షిణం చేయడం జరిగింది. గోప్రదక్షణ భూప్రదక్షణతో సమానం కనుక అహల్యను గౌతమమహర్షికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది.

అమ్మవారు పాప ప్రక్షాళనకోసం కాంచీపురంలో తపస్సు చేసాక " తరువాత ఏమి చెయ్యమంటారు " అని శివుడిని అడిగితే " అరుణాచలం వెళ్ళి గౌతమమహర్షిని కలువుము " అంటారు. అమ్మవారు వెళ్ళేసరికి మహర్షి ఆశ్రమంలో లేరు. శిష్యులు " కూర్చుని సేదతీరండి, మహర్షి ఇప్పుడే వచ్చేస్తారు " అంటే పరవాలేదు, మహర్షి ఎక్కడున్నారో చెబితే నేనే అక్కడకు వెడతానన్నారు అమ్మవారు. ఆవిడ పరాశక్తి, అయితేనేం ప్రస్తుతం శిష్యురాలే. అదీ మన గురువుల ఉత్కృష్టత. 

అరుణాచలంలో ఆగమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినది గౌతమమహర్షి. ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. గోదావరి నదిని ప్రసాదించినది గౌతములు.

గౌతమమహర్షి అహల్యల కుమారుడు శతానందుడే జనకమహారాజుకి కులగురువు.

అటువంటి మహర్షి భార్య అయిన అహల్య గురించి కొన్ని విషయాలు చదువుతాం కాని నమ్మదగినదిగా తోచదు. మూల రామాయణంలో కూడా తరువాతి కాలంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగినట్లుగా తెలుస్తూంది. ఇదీ అటువంటిదేనేమో అని ఎవరికయినా సందేహం కలిగినా తప్పుపట్టనక్కరలేదు.

అహల్య మహాపతివ్రత.

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. ఈ రోజు ఇతిహాసాల గురించి ఎవరికనుకూలంగ వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆ పాత్రల కు ఏదో మచ్చ అంటించి వాళ్ళు కూడా ఈ కలియుగం లో మనుషుల వలెనే ఉన్నట్లు ప్రచారం చేసి మెచ్చుకోలు పొందాలని తాపత్రయ పడుతున్నారు. అసలు వీళ్ళ అభిప్రాయాలు ఎవడు అడిగాడు?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ