పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని సామెత - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
వేదాలలోనూ ఉపనిషత్తులలోనే కాక పురాణాలలోనూ అద్భుత విజ్ఞానం ఉంది. కానీ అందరూ వీటిని చదివి అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకని వ్యాకరణం అవసరమయింది.
సంస్కృతభాషకు వ్యాకరణం " అష్టాధ్యాయి " వ్రాసినది పాణిని. 4000 ల సూత్రాలు వ్రాసారు ఈయన. సూత్రం అయినా అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం. అందుకని వీటికి " భాష్యం " వ్రాస్తారు ఒకరు, అందరికి సులువుగ అర్ధమవడానికి. భాష్యం అంటే వ్యాఖ్యానం. ఇంకా సులభంగా ఉండడానికి " వర్తీకం " వ్రాస్తారు. దీనిని " విపులవ్యాఖ్యానం " అంటారు.
పాణిని సూత్రాలకు కాత్యాయనుడు ( 600-300 బిసి) వర్తీకం వ్రాసారు. ఆ వ్యాఖ్యానాన్నే ఇంతవరకూ అనుసరిస్తున్నారు. ఒక సమస్యకు ఒకటికన్నా ఎక్కువ పరిష్కారాలు ఉంటాయి. ఇదివరకు ఏదో ఒకటి అనుసరించేవారు.
కాని పాణిని అలా 2 లేక ఎక్కువ పరిష్కారాలు ఉన్నప్పుడు చివరది తీసుకోవాలని ఒక చోట ( Panini's Metarule ) వ్రాసినట్లుగా తెలుస్తూంది.
దీనివలన ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి.
సంస్కృత వాజ్మయం ఓ మహాసముద్రం. ఖగోళాన్ని కాచి వడపోసేసారు.
హనుమాన్ చాలీసాలో 18వ శ్లోకంలో " యుగ సహస్ర యోజన పరభానూ " అని ఉంటుంది - అది భూమినుండి సూర్యుడి దూరం. యుగం అంటే 12000, సహస్రం అంటే 1000, యోజనం అంటే 8 మైళ్ళు. అదీ భూమినుంచి సూర్యుడి దూరం. 12000 × 1000 × 8 = 96000000 మైళ్ళు. ఇది తులసీదాసు చెప్పినట్లు కాదు, వేదాలలోని విషయం అని గ్రహించాలి.
ఇప్పుడు నాసా చెప్పినది 93000000 మైళ్ళు. మన ఋషులు చెప్పినదే సరైనది అయి ఉండే అవకాశం ఎక్కువ.
మన ఋషులు ఇలాచేస్తే మంచిది, అలాచేస్తే చెడ్డది అని ఊరికే కాలక్షేపం కోసం చెప్పలేదు. వారు చెప్పిన విషయాలలో అద్భుత శాస్త్రీయ విజ్ఞానం దాగివుంది. ఆవిషయం మనకన్నా విదేశీయులకు ఎక్కువగా అర్ధమవుతూంది ఇప్పుడు.
హమారా సనాతనధర్మ మహాన్ - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment