ద్రౌపది మహాపతివ్రత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు "🙏

అహల్యా.... - 2వ భాగం 

" అహల్యా ద్రౌపదీ సీతా 

  తారా మండోదరీ తధా 

  పంచకన్యాం స్మరేత్ నిత్యం 

  మహాపాతక నాశనం "

( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు )

ఈ పంచకన్యలు పతివ్రతలు. రోజుకు ఒకసారి తలచుకున్నా మహాపాపాలు కూడా నశిస్తాయి.

ద్రౌపది యజ్ఞవేదికనుండి పుట్టింది. అయోనిజ. పాండురాజు కోడలు. స్వయంవరంలో అర్జునుడు భార్యగా పొందినా అత్త కుంతి కోరినట్ట్లుగా మిగతా నలుగురికి కూడా భార్యగా మసలుకుంది. నీతిశాస్త్రాలు చదివిన పిల్లలకు తల్లి.

దృపదరాజు పుత్రి. కురుక్షేత్ర యుద్ధాన్ని పాండవుల పక్షాన సర్వసైన్యాధ్యక్షుడిగా ఒంటిచేత్తో నడిపించి విజయం సాధించిన ధృష్టద్యుమ్నుడి సోదరి.

ఆమె ఇంకోపేరు కృష్ణ. కృష్ణపరమాత్మ అభిమానాన్ని చూరగొన్న స్త్రీ.

అటువంటి ద్రౌపది ఎప్పుడూ పాండవుల వెంటే నడిచింది. 12 సం.లు అరణ్యవాసం చేసి నానా కష్టాలూ పడింది. ఏడాదిపాటు పరాయి రాజ్యంలో రాణికి సైరంధ్రిగా ఉండి నానా అవమానాలూ భరించింది.

ఎప్పుడూ తనమనసులోని బాధను బయటకు చెప్పని ద్రౌపది రాయబారానికి వెళ్ళేముందు " నీ అభిప్రాయం కూడా చెప్పు " అన్న కృష్ణపరమాత్మతో మాత్రం ఇలా అంది:

" రాజసూయ యాగా భృధ స్నానంతో పవిత్రమైన నా కేశపాశాన్ని పట్టి ఒక అనామకుడు ఈ అయిదుగురూ చూస్తూండగా సభా భవనానికి ఈడ్చుకుని వచ్చాడు.

మాధవా, ఆ దుశ్శాసనుడి చేతులలో తెగిపోగా మిగిలిన ఈ కేశపాశాన్ని విస్మరించకుండా సంధి ప్రయత్నం సాగించు. మీరందరూ మంచిచెడులు ఆలోచించగలిగిన మహానుభావులు " అని అంటుంది నర్మగర్భంగా. 

అంతటి మానసికక్షోభను అనుభవించింది తల్లి. మహాపతివ్రత. రోజుకొక్కసారి తలచుకున్నా తరిస్తాం.

ఏతత్ సర్వం శ్రీకృష్ణపరమాత్మార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

  1. ఇప్పుడు ఈ పతివ్రతల పేర్లు బయటకు తీసి వారిని గూర్చి ప్రస్తావించటం లో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. మనదేశం లో ఇప్పుడు గడచిన యుగాలలో జరిగిన ఇతిహాసాల పై ఇష్టం వచ్చినట్లు రాయడం అలవాటయింది. అదికూడా హిందువుల పుస్తకాల మీ దే.

    ReplyDelete
  2. అందుకే అప్పుడప్పుడు అయినా అపోహలు తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అందరూ. నాకెందుకులే అని ఊరుకోనక్కరలేదు. చదవగా చదవగా కొందరికయినా అపోహ తొలగే అవకాశం ఉంది. శుభం భూయాత్ ( మీ పేరు, ఫోన్ నంబర్ పెట్టండి )

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ