సీతమ్మతల్లి మహాపతివ్రత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

అహల్యా..... - 3వ భాగం 

" అహల్యా ద్రౌపదీ సీతా 

  తారా మండోదరీ తధా 

  పంచకన్యాం స్మరేత్ నిత్యం 

  మహాపాతక నాశనం "

( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు )

ఈ పంచకన్యలు పతివ్రతలు. రోజుకు ఒకసారి తలచుకున్నా మహాపాపాలు కూడా నశిస్తాయి.

అమ్మ కౌసల్యను అనునయించి ఒప్పించిన తరువాత రాముడు సీతమ్మ దగ్గరకు వెడతాడు ఆవిడను కూడా అనునయించి అరణ్యవాసానికి బయలుదేరడానికి. " మా తండ్రి నన్ను వనవాసానికి వెళ్ళమన్నారు " అని మాత్రం అనగానే సీతమ్మ " నేను కూడా మీతో బాటే " అంది. మిమ్మల్ని అనుసరిస్తాను అనలేదు. మీముందుండి మీమార్గంలో ఉండే ముళ్ళు రాళ్ళు తొలగిస్తూ మీమార్గం సుగమం చేస్తాను అంది తల్లి. 

ఇక్కడ సీతమ్మ ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది జాతికి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ఒకరి భాగ్యం ఇంకొకరిది. సుఖాలలోనే కాదు, కష్టాలలో కూడా ఒకరికి ఒకరు తోడు. 

వివేకానందులు అంటారు " ప్రపంచవాజ్మయం అంతా నాశనమయిపోయినా ఒక్క రామాయణం ఉన్నా లేక ఒక్క సీతమ్మను జ్ఞప్తిలో ఉంచుకున్నా భారతజాతి ( సనాతనధర్మం ) మరి కొన్నివేల సంవత్సరాలవరకూ నిలిచి ఉంటుంది " అని. ఎందుకని అంటే " శ్రీరాముడు లాంటి అందగాడు, ధీరోదాత్తుడు, ధర్మపరుడు ఇంకొకరు కనబడవచ్చు శ్రద్ధగా వెదికితే కాని సీతమ్మలాంటి స్త్రీ మాత్రం దొరకదు కాక దొరకదు " అని ఆయన నొక్కి వక్కాణించారు.

విశ్వనాధ సత్యనారాయణగారు తను వ్రాసిన రామాయణ కల్పవృక్షంలో అంటారు " నీ చరణ రవ్వదువ్వ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకున్ " అని. " ఓ సీతమ్మా, నీ కాలిధూళి స్త్రీజాతి అంతా నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలి " అని. సీతమ్మ మాటలు అంత అద్భుతం రామాయణంలో.

విశ్వనాథ వారు సీతమ్మను " అనింధనాగ్ని " అన్నారు. అగ్నిమంట రావాలంటే ఓ కర్రో చమురో ఉండాలి కదా. సీతమ్మకు ఇంధనం అక్కరలేదు. ఆవిడ సదా జ్వలించే అగ్ని అని తెలుసుకోవాలి.

సీతమ్మ తల్లి గురించి ఇలా వ్రాసుకుంటూ పోతే ఇంకో రామాయణం అంత అవుతుంది.

మహాసాధ్వి, మణిపూస. రోజుకు ఒక్కసారి తలచుకున్నా జీవితం పావనమవుతుంది.

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. చాలా సంతోషం. ఈ మధ్య కొంతమ ది పనిగట్టుకుని హిందూ ఇతిహాసాల ను అనుమానించి వాటిలోని పాత్రల ను అపఖ్యాతి పాలు చేస్తూ వారిని ఈకాలపు స్త్రీల తో పోల్చి గౌరవం లేకుండా చేస్తున్నారు. దీని వలన ఆ విమర్శకులకు గౌరవం ఏమాత్రం పెరగదు.

    ReplyDelete
  2. అందుకే అప్పుడప్పుడు మన సనాతనధర్మం గొప్పదనం చెప్పుకుంటూ ఉండాలి. ధన్యవాదములు. మీ పేరు ఫోన్ నంబర్ కూడా పెట్టండి. శుభమస్తు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ