మండోదరి మహాపతివ్రత - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
అహల్యా..... - 5వ భాగం
" అహల్యా ద్రౌపదీ సీతా
తారా మండోదరీ తధా
పంచకన్యాం స్మరేత్ నిత్యం
మహాపాతక నాశనం "
( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు )
వీరు ఐదుగురు మహాప్రతివ్రతలు. నిత్యం తలుచుకుంటే చాలు మాహాపాపాలు నాశనమవుతాయి.
హనుమ సీతాన్వేషణకోసం లంకలో అడుగుపెట్టాడు. చీకటిపడి చంద్రోదయం అవగానే వెతకడం మొదలుపెట్టాడు. ఎవరికీ కనబడకూడదని చిన్నరూపంలో వెడుతున్నాడు. ఒక్కొక్క భవనం లోనూ చూస్తున్నాడు. పుష్పకవిమానంకూడా ఎక్కి చూస్తున్నాడు. ఆఖరికి ఒక గదిలో మంచమ్మీద చక్కటిచీర కట్టుకుని, విలువైన నగలను అలంకరించుకుని నిద్రిస్తూన్న యువతి (మండోదరి) ని చూసాడు. అమ్మయ్య సీతకనబడిందని సంబరపడిపోయాడు. తనతోకను ముద్దుపెట్టుకున్నాడు, స్తంభం పైకి ఎక్కి క్రిందకు దూకాడు. గంతులు వేసాడు. కోతిచేష్టలన్నీ చేసాడు. అన్నీ ఒక్కక్షణమే. తెలివిలోకివచ్చి " ఇలా ఎలా అనుకున్నాను, సీతమ్మ మహాపతివ్రత, రాముడిని తలచుకుంటూ విచారంగా ఉంటుంది కాని ఇలా అంతఃప్పురంలో మంచంమీద నగలు ధరించి ప్రశాంతంగా నిదురిస్తుందని నేను ఎలా అనుకున్నాను " అని బాధపడ్డాడు.
తప్పు ఆయనదికాదు. మండోదరి మహాపతివ్రత. అటువంటి స్త్రీల ముఖం ప్రశాంతంగా ఓ ప్రత్యేక వర్ఛస్సుతో వెలిగిపోతూ ఉంటుంది.
అంతవరకూ హనుమ సీతమ్మను చూడలేదు. ప్రశాంతంగా ఓ ప్రత్యేకమయిన వర్ఛస్సుతో ఉండే ముఖాన్ని ఊహించుకుని వెతుకుతున్నాడు. అటువంటి ముఖం కనబడగానే, అదీ రావణుడి లంకలో, ఒక మాయకు లోనయ్యాడు. " బుద్ధిమతాం వరిష్టం, జ్ఞానినాం అగ్రగణ్యం " కనుక వెంటనే బయటపడగలిగేడు.
మహర్షివాల్మీకి విరచిత రామాయణంలో ఎంత అద్భుత ఘట్టం.
మండోదరి చెప్పిన మాటలు ఆవిడ వ్యక్తిత్వం ని తెలియచేస్తాయి. " మంచిపనులు చేసేవారికి మంచి ఫలితం, పాపపుపనులు చేసేవారికి పాపఫలితం తరతరాలు అనుసరిస్తుంది " అంటారు మండోదరి.
రావణుడు మరణించాక మండోదరి " రావణుడు కోరికలను పాములాగ కాలిక్రింద ఉంచుకున్నాడు. కాలు తీస్తే కాటువెయ్యకమానదు. కాలు తీసాడు, కాటువేసింది. ఇంద్రియాలు నిగ్రహించుకుని తపస్సు చేసి శివుడిని మెప్పించాడు. ఇంద్రియనిగ్రహం కోల్పోయి దుర్మరణం చెందాడు " అంటుంది.
అంతటి అద్భుతవ్యక్తిత్వం ఉండడంవల్లే ఆమెను సీతమ్మ అనుకుని ఒక్కక్షణం పొరబాటుబడ్డాడు హనుమ అంతటివాడు.
మండోదరి మహాపతివ్రత.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment