తాపత్రయాలు తగ్గించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

"తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రిక" - అమ్మవారి ఒక అత్యద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 357 వ నామం.

ఈ నామార్ధం " తాపత్రయముగల సంసారాగ్నిచే సంతప్తులగువారికి వెన్నెలవలె హాయినిచ్చునది " అని అర్ధం.

సంసారం అనేది ఒక వల. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంత మహామహులయినా మాయకు లోనవుతూంటారు. వ్యాసర్షి కూడా ఓ ఫుత్రుడిని పొందుతే మంచిదనుకున్నారు. శుక జననం జరిగింది.

అంత ఆకర్షణీయంగా ఉంటుంది సంసారసాగరం. సంసారాగ్ని - సంసారం ఒక అగ్ని - జాగ్రత్తగా లేకపోతే కాలుస్తుంది అనే ఎరుకలో ఉండాలి ఎప్పుడూ. అది అంత సులభం కాదు.

" ఎందుకొచ్చిన తాపత్రయం, వదిలేయ్ " అనడం తరచూ వింటూంటాం. 

ప్రతీ జీవుడు 3 రకాల తాపాలతో బాధపడుతూ ఉంటాడు. వీటిని " తాపత్రయాలు " అంటారు. అవి:

1. ఆధ్యాత్మికతాపం - ఇది స్వయంకృతం. శరీరానికి సంబంధించినవి. సమస్యలకూ, రోగాలూ అవీను. మనకు మనంగా కొని తెచ్చుకునేవి కూడా ఉంటాయి.

2. ఆధిభౌతికతాపం - ఇది ఇతర జీవుల ( మనుషులు, జంతువులు ) వల్ల కలిగే బాధలు. కొట్లాటలు అవీ కూడాను. కొంతవరకూ స్వయంకృతం.

3. ఆధిదైవికతాపం - ఇది జీవులచేతుల్లో లేనిది. సునామీలు, భూకంపాలు, తుఫానులు లాంటివి.

ఎక్కువగా ఆధ్యాత్మికతాపంతోనే బాధపడుతూంటారు అందరూ. సంసారసాగరాన్ని ఈదుతూన్నవారికి ఈ తాపత్రయాగ్ని బాధ కొంచెం ఎక్కువగానే ఉంటుంది.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఆవిడ చేయి అందించి సంసారసాగరంలో పూర్తిగా మునిగిపోకుండా పైకి లాగుతారు. మనస్సు ప్రశాంతతో నిండి ఉంటుంది. తాపత్రయాగ్ని బాధ తెలియకుండా వెన్నెలలో కూర్చున్నట్లుగా హాయిగా ఉంటుంది.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ