పాపమయినా పుణ్యమయినా అనుభవిస్తేనే తరుగుతుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
"ధర్మఏవ మనః కృష్ణే స్వభావ"
ధర్మరాజు ద్రౌపదితో అంటారు " ధర్మం నా స్వభావం మరి ( ఏమి చేయమంటావు )" అని.
12 ఏళ్ల అరణ్యవాసానికి వెడుతూన్నప్పుడు ద్రౌపది " ఎప్పుడూ ధర్మం ధర్మం అంటారు. ధర్మంని అనుసరిస్తూన్న మీరు అరణ్యం పాలయ్యారు. అధర్మం చేస్తూన్నవారు రాజ్యం ఏలుతున్నాడు " అని అంటే అప్పుడు ధర్మజుడు " ధర్మం నా స్వభావం మరి ( ఏమి చెయ్యమంటావు )" అంటారు.
ఇదే ధర్మరాజు భీష్ముని అడుగుతాడు " తాతా, పరిస్థితులు గమనిస్తే పాపాత్ములే ఎక్కువ సుఖపడుతూన్నట్లు, పుణ్యాత్ములు కష్టాలు అనుభవిస్తూన్నట్లు కనిపిస్తుంది, ఎలా " అని.
అప్పుడు భీష్ముడు అంటారు " అది నీ భ్రమ " అని. పాపం పుణ్యం వేరువేరుగా అనుభవించాలి. పాపం 100, పుణ్యం 80 అంటే ఇక మిగిలిన పాపం 20 అని కాదు.
ఏన్నో జన్మలుగా ప్రొగుచేసుకున్న పుణ్యం వల్ల ఈ రోజు అలా సుఖపడుతూన్నట్లు కనిపిస్తాడు. చేసిన పాపాలను కూడా ఇంకో రోజు ఘనంగా అనుభవిస్తాడు అని.
" ప్రారబ్దం భోగతో నశ్యేత్ " - పాపమయినా పుణ్యమయినా అనుభవిస్తేనే తరుగుతుంది.
బ్యాంకులో డబ్బు కట్టగానే క్షణాలలో ఖాతాలో జమయిపోతూంది. ఏటిఎమ్ లో డబ్బుతీస్తే క్షణాలలో ఖాతాలో తరిగిపోతూంది. మన ఏర్పాట్లే ఇంత పకడ్బందీగా ఉంటే అమ్మవారి ఏర్పాట్లు ఎంత నిక్కచ్చిగా ఉంటాయి. ప్రతీ కర్మఫలమూ ఖాతాలో జమయిపోతూ ఉంటుంది. అనుభవించక తప్పదు.
ధర్మో రక్షతి రక్షితః
మన సనాతనధర్మానికి సాటిలేదు, రాబోదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
కొన్ని పరస్పర విరుద్ధమైన అంశాలు అయోమయానికి గురి చేసే అవకాశం ఉంది. గీత లో భగవానుడు "అర్జు నా నీవు ఎంత పాపాత్ముడు వైనా జ్ఞానాగ్ని చే అన్నీ పాపాలు నశింపజేసుకో గలవు,జ్ఞాగ్ని అగ్ని వలె ఎంతటి పాపం నైనా అగ్నికట్టేలను దహించివేసినట్లుయన్ని పాపాల్ని దహించివేస్తుంది" అంటాడు.
ReplyDeleteమీపేరు ఫోన్ నంబర్ కూడా ఇవ్వవలసింది. పరమాత్మ అన్నది " జ్ఞానం సమస్తపాపాలను ఒక్క అగ్గిరవ్వ దూదిమేటు నంతటినీ భస్మం చేసినట్లు నాశనం చేసేస్తుంది అని. జ్ఞానం కలగడం అంత సులభమా. ఎంతటి సాధన చేయాలి. అటువంటి సాధనే కదా రత్నాకరుడుని వాల్మీకిగా చేసింది. శుభమస్తు
ReplyDelete