అధర్మం పెరుగుతూన్నప్పుడు కులస్త్రీలు బాధపడతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు "🙏

" అధర్మాభిభవాత్ కృష్ణ, 

  ప్రదూష్యంతి కులస్త్రియః, 

  స్త్రీషు దుష్టాసు వార్షేయ, 

  జాయతే వర్ణసంకరః " 

                   - భ.గీత 1:41

" అధర్మం పాపం పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు ఎక్కువ దూషితలగుదురు. అప్పుడు వర్ణసంకరము ఏర్పడును " అన్నారు పరమాత్మ.

ఆశ్చర్యకరంగా స్త్రీలే ఎక్కువగా దూషితలవుతారు అన్నారు పరమాత్మ.

ఇక్కడ కులస్త్రీలు అంటే సత్యం ధర్మం నిష్ఠ పాటించేవారు. 

సంప్రదాయకుటుంబాలలో పుట్టినా కొందరు స్త్రీలు లవ్ జిహాద్, పరకులవివాహాలు వంటి వాటికి గురవుతున్నారంటే నేరం వారిది కాదు, సమాజంలో పెరిగిపోయిన " అధర్మం, పాపం " లది. 

ధర్మానికి " తపస్సు, శౌచం, దయ, సత్యం " నాలుగు పాదాలు. తపస్సు మోహం కారణంగానూ, శౌచం దుష్టసాంగత్యం కారణంగానూ, దయ గర్వం కారణంగానూ పతనమౌతాయి. ఇలా 3 పాదాలు పతనమవడం కారణంగా సత్యం కుంటి నడక నడుస్తుంది. 

కొందరు ఆచారాలను పాటిస్తూ సంప్రదాయంగా ఉంటారు. వీరి పరిచయస్తులు ఏ ఆచారాలను, సంప్రదాయాలను పాటించరు. ఇటువంటి వారితో సాంగత్యంవలన వీరిలో కూడా క్రమేపీ మార్పు వస్తుంది. మన ఆచారాలను చూసి నవ్వుకుంటారేమో, వేళాకోళం చేస్తారేమో, ఆచారాలను పాటించని వారి పరిస్థితే బాగుంది అనేటువంటి ఆలోచనలు " దుష్టసాంగత్యం " వలన వీరి మనస్సులను కలుషితం చేస్తాయి. ఇప్పుడు సమాజంలో పరిస్థితి ఇదే. 

నాయకులను కూడా చూస్తూంటాం. ఎదుటిపార్టీల నాయకులనేమైనా అనేటప్పుడు ఆ నాయకుల కుటుంబాలలోని, ఏరకంగానూ సంబంధంలేని స్త్రీలగురించి అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా అధర్మం పెరిగిపోవడం వలననే.

5000ల సంవత్సరాల క్రితమే ఈవిషయాన్ని ఎంత స్ఫష్టంగా తెలియచేసారు పరమాత్మ.

మన సనాతనధర్మం గొప్పదనం అది. దానిని పాటిస్తే సమాజంలో అధర్మం, పాపం త్రగ్గడానికి అవకాశం ఉంది. ప్రపంచశాంతికి మన సనాతనధర్మమే దిక్కు. 

" నాన్యపంథా అయనాయ విద్యతే " - పురుషసూక్తం. అయనాయ అంటే ముక్తి. దానికి పరమాత్మ పాదాలను పట్టుకోవడం తప్ప వేరే దారి లేదు.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ