" అవ్యాజకరుణామూర్తి " సీతమ్మ జయంతి నేడు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" ఇయం సీతా మమ సుతా 

  సహధర్మచరీ తవ,

  ప్రతీచ్ఛ చైనాం భద్రం తే 

  పాణిః గృహ్ణీష్వ పాణినా " 

          - వాల్మీకి రామాయణం.

జనకుడు సీతమ్మతల్లి చేతిని రాముని చేతిలో పెట్టి అలా అంటారు. ఇక్కడ " భద్రం తే " అంటారు. మా అమ్మాయి " నీకు క్షేమం కలిగిస్తుంది " అని. ఆశ్చర్యంగా లేదూ. 

ఋష్యాశ్రమాన్నించి వీరు బయలుదేరి వెడుతూంటే సీతమ్మతల్లి అంటుంది రాముడితో - " ఎంత జాగ్రత్తగా ఉన్నా అధర్మం ఏదో ఒక సందుచూసుకుని మనిషిలో ప్రవేశిస్తుంది. దానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి అసత్యమాడడం, పరదారాభిగమనం ( దారా అంటే భార్య. పరుల భార్యలపై మనసు పడడం అని అర్ధం ), వైరంలేని యుద్ధం. మొదటి రెండు మిమ్మల్ని దరిచేరవు కాని 3వది మనకు అవసరమా. రాక్షసులతో మనకు వైరంలేదు. వనవసానికి వచ్చాం, గుట్టుగా పూర్తిచేసుకోక ఎందుకివన్నీ. ఆయుధాలే మనకు అవసరంలేదు కదా " అని అంటుంది.

సీతమ్మ భార్యగా శ్రీరాముడిని ఎల్లవేళలా ధర్మమార్గంలోనే గడిపేలా సహకరించింది.

అందుకే భార్యని " ధర్మపత్ని " అంది సనాతనధర్మం. భార్య సహకారం లేకపోతే పోతన అయినా, త్యాగయ్య అయినా ఇంకొకరయినా అటువంటి ఉన్నతస్థితికి చేరడం కష్టమే. 

అందుకే భర్త సంపాదించిన ఫుణ్యంలో సగభాగం భార్యకు చెందుతుంది అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. ఫుణ్యంలోనే కాదు, కీర్తిలో కూడా.

సీతమ్మ శ్రీరాముడు కూడా వేల సంవత్సరాల తరువాత కూడా ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా నడచుకున్నారు. అందుకే వారు ఆదర్శ దంపతులు అయారు.

ఈరోజు సీతమ్మ జయంతి. శుభాకాంక్షలు. సదా అందరినీ చల్లగా చూడమని " అవ్యాజకరుణామూర్తి " ని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ