చెట్టు ముందా, విత్తు ముందా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

"సర్వయోనిషు కౌన్తేయ 

 మూర్తయః సమ్భవంతి యాః, 

 తాసాం బ్రహ్మ మహద్యోని

 రహం బీజప్రదః పితా " 

" కౌంతేయా - సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను " అన్నారు పరమాత్మ.

మగవారి బీజం ఆడువారి అండంతో కలిస్తే సంతానం కలుగుతూంది. మరి ఆ బీజం ఎక్కడినుంచి వచ్చింది. వారి తండ్రినుంచి. మరి వారి తండ్రికి ఎక్కడినుంచి వచ్చింది. వారి తండ్రినుంచి. దీనినే ఇప్పుడు జీన్స్ అంటున్నారు.

ఇలా బీజం మూలాల గురించి వెనక్కి వెళ్ళగా వెళ్ళగా పరమాత్మ వద్ద ముగుస్తుంది. అదే పరమాత్మ తెలియచేసినది.

" మాతా చ పార్వతీదేవీ 

  పితా దేవో మహేశ్వరః ( అన్నపూర్ణాష్టకం )" అని ప్రార్థిస్తాం మనం.‌ ఎంత అద్భుతం.

పరమాత్మ " సర్వయోనిషు " అన్నారు. అంటే అన్ని జీవులు. ఇది మనుషులకే అనుకోకూడదు. జంతువులకు, పక్షులకు, చెట్లకు, సూక్ష్మజీవులకు అలా అన్నిటికీ వర్తిస్తుంది.

ఇప్పుడు ఒక అద్భుత విషయం చూద్దాం. " చెట్టు ముందా విత్తు ముందా " అని ఓ విచిత్రమైన సందేహం అందరికీ, మనకు కూడా. ఈ శ్లోకం చదివి అర్ధం చేసుకున్నాక ఆ సందేహం తీరిపోతుంది. పరమాత్మ నుంచే అన్ని జీవులకు బీజం వస్తుందన్నారు. అంటే పరమాత్మ/విరాట్పురుషుడే అన్నిటికీ మూలం. అంటే మనిషి/జంతువు/చెట్టు అన్నీ ఆయనే. అంటే చెట్టే ముందని తెలుస్తూంది.

అదీ మన సనాతనధర్మం విశిష్టత.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ