శ్రీశరభజయంతి. శుభాకాంక్షలు. - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
కోయంబత్తూర్ సమీపంలో " ప్రత్యంగిరాదేవి " ఆలయం ఉంది. దానికి స్థలపురాణం ఉంది.
నృసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపినతరువాత చాలాకాలం ఆ కోపం/ఉగ్రం లోంచి బయటకు రాలేక అడవులు పట్టితిరుగుతున్నాడు. బ్రహ్మ, ఇంద్రుడు వంటివారంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో శివుడిని వేడుకున్నారు ఏదో ఒకటి చేసి ఆయన్ని మామూలుగా చెయ్యమని.
శివుడు సరే అని శరభుడుగా వచ్చి స్వామికి అడ్డుగా నుంచున్నారు. ఆయన మీదకే నృసింహస్వామి కోపంగా దూసుకుని వెళ్ళారు. శరభుడి కుడిచేతిలో ప్రత్యంగిరాదేవి కూర్చుని ఉంది. శివుడి మీదకే స్వామి కోపంగా రావడంతో లేచినుంచుంది కోపంతో.
ఆవిడ " సహస్రశీర్షావదనా సహస్రాక్షీ సహస్రపాత్....." - వేల శిరస్సులు, ఎర్రటి వేలకళ్ళు, ఆయుధాలతో కూడిన వేల చేతులు. కోపంతో హుంకరించేటప్పటికి నృసింహస్వామి భయపడిపోయి చల్లబడిపోయాడు.
ఆవిడ " అయ్యో ఎదురుగా ఉన్నది నా సోదరుడు, ఎలా కోప్పడేదీ " అనుకోలేదు. అనుకుంటే స్వామి ఉగ్రంలోంచి బయటకు రాడు, లోకాలూ తల్లడిల్లిపోతాయి.
అందుకని అవసరమయినప్పుడు కోపం తెచ్చుకోవాలి. తప్పులేదు.
అమ్మవారు శివుడు వేరు కాదు. ఒకటే శివశక్తి స్వరూపం.
ఈరోజు శరభజయంతి. శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీసదాశివార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment