బౌద్ధం నుంచి సనాతనధర్మం ఎలా కాపాడబడింది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
ఆదిశంకరులు తన మొదటి శృంగేరీ శారదాపీఠానికి అధిపతిగా మందనమిశ్రాను నియమించారు. మిశ్రాను, ఆయన భార్యను వాదనలో ఓడించి శిష్యులుగా చేసుకున్నారు శంకరులు.
ఈ మిశ్రాగారి గురువు " కుమరిలభట్టు ". ఈయన వేదంలోని కర్మకాండ గొప్పదనేవారు. కర్మకాండ కొంచెం కష్టం, శ్రద్ధగా చేయవలసినది. ఖర్చుతో కూడుకున్నది.
రాబోయే కాలంలో తిండికే ఎక్కువ సమయం ఖర్చుచేసే సామాన్యులు కర్మకాండ ఎలా చేస్తారు. జ్ఞానకాండ నయమని చెప్పగలిగితే ఏ జపమో, స్తోత్రమో, అష్టకమో చదువుకుని సులభంగా తరిస్తారు సామాన్యులు అని తలచిన శంకరులు ఈ కుమరిలభట్టుతో వాదించి ఓడించడానికి ప్రయాగ వెడతారు. ఈయన వెళ్ళిన సమయానికి భట్టుగారు అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటారు.
శంకరులను చూసి " నువ్వు బ్రహ్మసూత్రాలకు వ్రాసిన భాష్యం చూసాను. చాలా బాగుంది. దానికి వర్తీకం ( విపుల వ్యాఖ్యానం ) వ్రాద్ధామనుకున్నాను. సమయం కుదరలేదు. నువ్వు మిథిలకు వెళ్ళి నా శిష్యుడు మందనమిశ్రాతో వాదన చెయ్యి " అని తెలియచేస్తారు.
శంకరులు అటునుంచి అటే మిధిల వెళ్ళి మిశ్రాను, ఆయన భార్య భారతిని వాదనలో ఓడించడం జరిగింది.
ఇంతకీ భట్టుగారు అగ్నిప్రవేశం ఎందుకు చేయవలసి వచ్చిందో చూద్దాం.
అప్పటికి బౌద్ధం మంచి ఉచ్ఛదశలో ఉంది. ప్రజలు నిర్వీర్యులుగా తయారయి పోతున్నారు. వేదం, సనాతనధర్మం ప్రతిపాదించిన " అందరూ కష్టపడాలి " - " నరుతే శ్రాంతస్య సఖ్యాయ దేవాః - కష్టపడని వారికి దేవతలు కూడా సహాయపడరు " - వేదం - మరుగున పడిపోతూంది ( ఇప్పటి ఉచిత పధకాలు లాగ ). ఏమి చేయాలి అని ఆలోచించి ఓ బౌద్ధారామంలో విద్యార్ధిగా చేరారు. బౌద్ధం అంతా నేర్చుకుని తన గురువుగారితో వాదించి బౌద్ధం అంతా " తప్పుల తడక " అని నిరూపించారు. గురువుకు మతిపోయింది. విద్యార్ధి ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
అప్పటినుంచి బౌద్ద ప్రభావం తగ్గి సనాతనధర్మం పుంజుకుంది.
కాని సనాతనధర్మం చెప్పినది ఏమిటి " గురుర్ బ్రహ్మ.......". మరి తను గురువును ఓడించడం, తప్పు పట్టడం ధర్మమా అని బాధపడి భట్టుగారు బహిరంగంగా అగ్నిప్రవేశం చేసారు పాప పరిహారం కోసం. అదీ మన సనాతనధర్మం విశిష్టత.
కాని ఆయన చేసిన పని వల్ల సనాతనధర్మం, దేశం రక్షించబడింది.
ఎందరో మహానుభావులు. అందరికీ వందనములు.
సనాతనధర్మం పరిరక్షణ అందరి బాధ్యత - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment