హోమాలు, యాగాలవల్ల ఉపయోగమేమయినా ఉందా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" అగ్నౌ ప్రాప్తాహుతి సమ్యక్ 

  ఆదిత్యముపతిష్ఠతే

  ఆదిత్యాత్ జాయతే వృష్టిః

  వృష్టేరన్నం తధా ప్రజాః "

                - వేదమంత్రం

" అగ్నిలో/హోమంలో వేసిన హవిస్సులను అగ్నిదేవుడు ఆదిత్యమండలానికి తీసుకుని వెడతారు. అక్కడనుండి దేవతలందరికీ చేరుతుంది " అని తెలియచేస్తూంది వేదం.

" అగ్ని ముఖావై దేవాః " - అగ్నిముఖంగానే ఏదయినా దేవతలకు చేరుతుంది.

అసలు యాగం/హోమం చేసినప్పుడు అగ్నిలోనే ఎందుకు వేయడం. 

" పురుషసూక్తం " లో విరాట్ పురుషుని వర్ణన చేస్తూ " ముఖాత్ ఇంద్రశ్చాగ్నిశ్చ " అని ప్రార్ధిస్తాం. విరాట్పురుషుని నోటిలోంచి అగ్ని ఇంద్రుడు వచ్చారు. ముఖం అంటే నోరు. అగ్ని విరాట్పురుషుని నోరుగా తెలుస్తూంది. ఆహారాన్ని దేనినయినా నోటిలోనేగా వేస్తాం. అందుకే దేవతలకు సమర్పించేవన్నీ అగ్నిలో వేస్తాం అంటే అగ్నిముఖంగా ఇస్తాం.

హోమాలవల్ల మనకు, సమాజానికి, పర్యావరణానికి ఏమయినా ఉపయోగముందా?.

ఓ చక్కటి విషయం చూద్దాం:

పోలండ్ దేశంలో " హోమా థెరపీ" అనే చికిత్సావిధానం ఉంది. ఏదయినా అనారోగ్యం కలిగినప్పుడు పిలిస్తే ఈ సంస్థవారు వచ్చి తగిన హోమం చేస్తారు. దానిలో ఆవునెయ్యిని, సమిధలను ( రావి మొ.గు దేవతావృక్షాలవి ) వేస్తూ మంత్ర సహితంగా హోమం చేస్తారు. ఇటువంటి థెరపీ ఎలా మొదలయిందో తెలుసుకుందాం.

కొన్ని సం.ల క్రితం ఆసియా మెహర్ ( Asia Maher ) అనే పోలండ్ దేశస్తుడు మన దేశానికి వచ్చాడు ఈ హోమాల విషయం గుట్టు రట్టు చేద్దామని అయి ఉండవచ్చు లేక వింతగా అనిపించి కూడా అయి ఉండవచ్చు.

ఈయన మూడు రకాల హోమాలు చేయించారు - ఆవునెయ్యి సమిధలు లేకుండా వేరే విధంగా హోమం చేయించారు. ఆవునెయ్యి సమిధలతో హోమం చేయించారు. ఆవునెయ్యి సమిధలు వేస్తూ మంత్ర సహితంగా హోమాలు చేయించారు.

ఆశ్చర్యకరంగా మొదటి పద్ధతిలో తేడా ఏమీ తెలియలేదు. 2వ పద్ధతిలో అక్కడి గాలిలో స్వచ్ఛత కొద్దిగా పెరిగింది. 3వ పద్ధతిలో గాలిస్వచ్ఛత అద్భుతంగా పెరిగింది. ఆయన ఆశ్చర్యపోయి ఈ హోమాలని ఇలాగే వేరేవేరే చోట్ల చేయించారు. అన్నిచోట్లా మూడో పద్ధతిలో మంత్రాల కంపనాల కారణంగా గాలిలో స్వచ్ఛత అద్భుతంగా పెరిగింది. అంటే ఇలా చేయడం వల్ల గాలిలోని హానికరమైన వైరస్ నశించింది అని తెలుస్తూంది.

ఈయన " అగ్నిహోత్ర " అనే అద్భుతమైన పుస్తకం వ్రాసారు. పోలండ్ తిరిగి వెళ్ళి హోమా ధెరపీ సంస్ధని ప్రారంభించారు.

అదీ మన ఆర్షవిజ్ఞానం ప్రతిభ. " ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి " అన్నట్లుగా మన కుహనా మేధావులకు మన సనాతనధర్మం విశిష్టత అర్ధంకాక అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు.

" చేరి మూర్ఖుల మనసు 

  రంజింపరాదు ( లేము ) "

హమారా సనాతనధర్మ మహాన్ - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ