నేడు కాటన్ దొర జయంతి - స్మరించుకుని గౌరవించుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
మా గ్రామానికి 2 కి.మీల దూరంలో ఉన్న గోదావరీనది మీద ఆక్వాడక్ట్ కడదామని నిర్ణయించి సలహాదారు కోరికతో ముహూర్తం పెట్టమని మా అక్కగారి మామగారి తండ్రిగారి దగ్గరకి వచ్చారు కాటన్ గారు. మూహూర్తం పెట్టి కట్టడం వయస్సు 100 సంలు అని, 100వ ఏట ఫలానా స్థంభం వద్ద బీటతీస్తుందని మరమ్మత్తు చేసుకుంటే ఇంకో 100 సంలు వాడుకలో ఉంటుందని చెప్పారుట.
అలాగే 100వ ఏట జరగడం మరమ్మత్తు చేయడం జరిగింది.
ముహూర్తం పెట్టినందుకు దక్షిణ ఏమి ఇవ్వమంటారు అని అడిగితే " మా గ్రామస్తుల పొలాల్లో ఉన్న తాటిచెట్లు వారే వాడుకోవడానికి ( గోశాలకి యాగశాలకి తాటి దుంగలు, ఆకులు ముఖ్యం ) అనుమతి ఇవ్వండి " అని అడగడం కాటన్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది.
విషయమేమిటంటే అప్పుడు కట్టే వంతెనలన్నింటికీ తాటి దుంగలు వాడేవారు. అందుకని ఇప్పుడు మంచిగంధం మొక్కలమీద ఉన్నట్లుగా అప్పుడు తాటిచెట్లు కొట్టడం మీద నిషేధం ఉండేది.
గోదావరిని అతి దగ్గరగా తీసుకొనివచ్చి ప్రతిదినం స్నానం చేసే అవకాశం కల్పించిన కాటన్ మహాశయునకు కూడా త్రిసంధ్యలలోనూ అర్ఘ్య ప్రదానం ఇచ్చేవారు అందరూ ఆ రోజుల్లో.
గోదావరిజిల్లాలవారికి ముఖ్యంగా కోనసీమవాసులకు చిరస్మరణీయుడు కాటన్ దొర.
ఈరోజు కాటన్ దొర జయంతి. శుభాకాంక్షలు. అటువంటి నిర్లోభపరులని స్మరించుకుంటే మనకు, దేశానికి శుభం - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment