వికారాలకు లొంగిపోనివారు ధీరులు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ధీరా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 916 వ నామం.
ధీరా అంటే ధీరురాలు/పండితురాలు అని అర్ధం.
" పునంతి ధీరాః అపసో మనీషా "
- వికారాలకు లొంగిపోని ధృఢమైన చిత్తం, బుద్ధికలిగి ఉండేవారు ధీరులు అని చెబుతూది వేదం.
" వికారహేతౌ సతి విక్రయంతే
ఏషాన్నతేతాంసి తవేయ ధీరాః "
- మహాకవి కాళిదాసు
ఎదురుకుండా వికారాలు కనబడుతూన్నా/జరుగుతూన్నా మనసు చలించనివారు ధీరులు అన్నారు మహాకవి కాళిదాసు.
ఇటువంటి వారిలో అమ్మవారు స్థితులై ఉంటారు.
పరమాత్మ ఇదే విషయాన్ని గీతలో ఇలా తెలియచేసారు:
" జితాత్మనః ప్రశాంతస్య
పరమాత్మా సమాహితః !
శీతోష్ణసుఖదుఃఖేషు
తథామానావమానయోః "
- భ.గీత 6:7
శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా (చలింపక) ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడైయుండును.
" అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య
మున్నటులే, శోకానా మరుగున దాగి
సుఖమున్నదిలే, ఏదీ తనంతతానై నీ
దరికిరాదు, శోధించి సాధించాలి
అదియే ధీర గుణం "
అన్నారు ఓ సినీకవి. అదీ ధీరగుణం అంటే. ఎంత అద్భుత సాహిత్యం.
అటువంటి మానసిక స్థితిని ప్రసాదించమని అందరం అమ్మవారిని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment