సీతమ్మను నవ్వించిన హనుమ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

హనుమ మొదటిసారి లంకలో సీతమ్మవారిని చూసి మాట్లాడినప్పుడు సీతమ్మ అంటుంది " రాముడు ఎందుకు ఇంత ఆలస్యం చేసారు " అని. " అమ్మా నా భుజాల మీద కూర్చో, క్షణంలో రాముని వద్దకు చేరుస్తాను " అని హనుమ అంటే సీతమ్మ ఫక్కున నవ్వింది. అదేమిటమ్మా అలా నవ్వావు అంటారు హనుమ. 

నిన్ను నువ్వు చూసుకో ముందు అంటుంది సీతమ్మ. అప్పుడు హనుమ పిల్లిపిల్లలా ( వాల్మీకి అలా అన్నారు ) ఉంటారు.

అయ్యో మర్చిపోయానమ్మా, నా నిజరూపం చూడమ్మా అని ఆకాశంలోకి ఎదిగిపోతారు హనుమ. ఎక్కడా నక్షత్రాలు కూడా కనబడటంలేదు, హనుమ అలా ఉన్నారు.

ఎవరయినా చూస్తారని వెంటనే ఉపసంహరించు నీ రూపాన్ని అంటుంది సీతమ్మ.

సీతమ్మ అంటుంది " నువ్వు అలా తీసుకుపోతే రాముడికి రావణుడికి తేడా ఏమి ఉంటుంది. రాముడు వచ్చి రావణుడిని వధించి నన్ను తీసుకుని వెడితేనే లోకానికి విషయం తెలుస్తుంది, హర్షిస్తుంది. అద్భుత ఘట్టాలు.

హనుమ భారతజాతికి అమ్మవారు ఇచ్చిన అత్యద్భుత బహుమతి - సూర్య.

శుభమస్తు

Comments

  1. భారత జాతి గర్వపడే విధంగా సీతమ్మ ప్రవర్తించింది. హనుమ తో. అసలు రామావతార ఉద్దేశ్యమే రావణుడి వధ. అలాంటప్పుడు సీతమ్మ ఏదో విధంగా భర్తను చేరుకోటం ఎలా చేస్తుంది?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ