అందుగలడిందులేడని సందేహము వలదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" విశ్వతోముఖీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 780 వ నామం.

" విశ్వతోముఖీ " అంటే అన్ని దిక్కులందు ముఖములు గలది.

అమ్మవారిని శ్రీసూక్తంలో " లోకైక దీపాంకురాం " అని ప్రార్ధిస్తాం. లోక ఏక దీపాంకురం - లోకానికి ఒకే ఒక్క దీపంగా ఉన్నది. దీపం అన్ని వైపులా కాంతినిస్తుంది. ఒకవైపు అనో కొన్నివైపులనో చూడడం ఉండదు. దీపం అంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది.

అర్జునుడు పరమాత్మ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యంతో ఇలా అంటారు:

"నమః పురస్తాదథ పృష్ఠతస్తే

 నమోయస్తు తే సర్వత్ ఏవ  

 సర్వ, అనంతవీర్యామిత  

 విక్రమస్త్వం సర్వం  

 సమాప్నోషి తతోథ్యసి సర్వః"

                - భ.గీత 11:40

ఓ అనంత శక్తి గల స్వామీ, నీకు ముందు మరియు వెనుక నుండి, నిజానికి అన్ని వైపుల నుండి నా నమస్కారాలు. మీరు అనంతమైన శౌర్యాన్ని కలిగి ఉన్నారు మరియు శక్తి కలిగి ఉన్నారు మరియు అంతటా వ్యాపించి ఉన్నారు, అందువలన, మీరు సర్వం.

నారదులు ఉపదేశించిన " ఓం నమో భగవతే వాసుదేవాయ " నామజపాన్ని చేస్తున్నాడు ధృవుడు అత్యంత శ్రద్ధతో. లోకాలన్నీ తల్లడిల్లాయి. దేవతలు ఆశ్చర్యపోయారు. నామజపానికే ఇంత విపరీతమేమిటి అని. జరిగింది ఏమిటంటే ధృవుడు తన హృదయంలో ఉన్న పరమాత్మ మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తూ ఊపిరి తీసుకోవడం మానేసాడు. హృదయంలో ఉన్న విష్ణువుకు గాలి లేదు. విష్ణువు విశ్వవ్యాపకుడు. విశ్వానికంతా గాలి లేకుండా పోయింది. రక్షించండి మహాప్రభూ అని వెళ్ళి విష్ణువు కాళ్ళమీద పడ్డారు దేవతలు. 

అందరినీ చల్లగా చూడమని " విశ్వతోముఖి " ని వేడుకుందాం. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ