సూర్యుడు కూడా జడమే అమ్మవారి చైతన్యం లేకపోతే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" భానుమండలమధ్యస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 275 వ నామం .

" భానుమండలమధ్యస్థా " అంటే సూర్యబింబం మధ్యనందు ఉన్నది అని.

సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు. ఆరోగ్య ప్రదాత. " ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ " అన్నారు. ఆయనను మార్తాండుడు అంటారు. అంటే చనిపోయిన అండానికి కూడా చైతన్యాన్ని కలిగిస్తాడు. ఆయన ఉదయిస్తేనే ప్రకృతిలోను, జీవులలోనూ చైతన్యం కలుగుతుంది. ఈ శక్తులన్నిటికీ మూలం సూర్యుడిలో ఉన్న అమ్మవారి చైతన్యం.

రాముడు రావణుడితో యుద్ధం చేస్తూన్నప్పుడు అలసిపోయాడు. దేవతలతోపాటు యుద్ధం చూస్తూన్న అగస్త్యుడు గమనించారు ఆ విషయం. వెంటనే రాముడిని సమీపించి ఆదిత్యహృదయం పారాయణ చేయి. శక్తి, విజయం కలుగుతాయి అన్నారు.

రాముడు ఆచమనం, సంకల్పం చేసి ఆదిత్యహృదయం పారాయణ చేసారు. రాముడికి దేవతల మధ్యన సూర్య దర్శనం అయింది.

" నిశిచరపతి సంక్షయం   

  విదిత్వా సురగణ 

  మధ్యగణో వచస్త్వరేతి " 

ఇక్కడ " వచస్ త్వర ఇతి " అన్నారు. సూర్యుడు " త్వర " అన్నారు. ఆలస్యం ఎందుకు, త్వరపడు, రావణుడిని చంపు అన్నారు సూర్యుడు.

అమ్మవారిని " ధియోయోనః ప్రచోదయాత్ " అని ప్రార్థిస్తాం - మా బుద్ధిని ప్రేరేపించు తల్లీ అని. సూర్యుడిలో ఉన్న అమ్మవారు అదే చేసారు అప్పుడు, రాముడికి ప్రచోదనం అయింది. వెంటనే రావణ సంహారం జరిగిపోయింది.

అమ్మవారి చైతన్యం లేకపోతే సూర్యుడు కూడా జడమే అని తెలియచేసారు పూజ్యులు సామవేదంవారు.

ఎల్లప్పుడూ సత్సంకల్పాలే కలిగేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం అందరం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ