అమ్మవారు అంత సులభంగా దొరకరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" దురాధర్షా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 772వ నామం.

" దురాధర్షా " అంటే కష్టమయిన తపముచే స్వాధీనము చేసుకొనుట గలది - అమ్మవారిని స్వాధీనం చేసుకొనుట అంత సులభము కాదు - అని అర్థం.

అమ్మవారిని ఎలా చూడగలమో బ్రహ్మాండపురాణం తెలియచేసింది:

" ధ్యానైక దృశ్యా జ్ఞానాంగీ 

  విద్యాక్షా హృదయా స్పదా 

  ఆత్మైక్యాత్ వ్యక్తమాయాతి 

  చిరానుష్టాన గౌరవాత్ " 

అమ్మవారు జీవుడి హృదయంలోనే ఉంది. అనుష్టానం అంటే ఎడతెగని సాధనతో అమ్మవారిని చేరగలం అని తెలియచేస్తూంది పురాణం. ఎంత కఠిన సాధన చేయాలో తెలుస్తూంది.

మూకశంకరులు కామాక్షీ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు:

" చింతితఫలపరిపోషణ

  చింతామణిరేవ   

  కాంచినిలయా మే 

  చిరతరసుచరితసులభా

  చిత్తం శిశిరయతు  

  చిత్సుధాధారా " 

        - మూకపంచశతి -3

ఇందులో " చిరతరసుచరితసులభా " అన్నారు. అంటే ఎంతోకాలము చేసిన సత్కర్మాచరణములచే సులభముగా లభించునది అని అర్ధము. ఎంతో కాలము అంటే ఎన్నో జన్మలు కూడా పట్టవచ్చు. సాధన చేయగా చేయగా చివరి జన్మలో " పరమాచార్య " వంటి జన్మ లభిస్తుంది, ఆ తరువాత జన్మ ఉండదు.

సాధన కష్టం అనుకుని దూరం పెట్టకూడదు. మొదలు పెడితే కొన్ని జన్మల తరువాత అయినా ముక్తి లభిస్తుంది. లేకపోతే ఈ జననమరణచక్రంలో అలా పుడుతూ చస్తూ బాధపడుతూ ఉండవలసిందే.

సాధనకోసం అవసరమయిన సంకల్ప బలాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ