స్తోత్రాలు కీర్తనలు దేవతా స్వరూపం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" స్తోత్రప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 927 వ నామం .

" స్తోత్రప్రియా " అంటే స్తుతులు ఇష్టముగా గలది. 

స్తోత్రం అంటే కీర్తించడం. అమ్మవారిని కీర్తించడం అంటే ఆవిడ గుణగణాలను ఎలుగెత్తి చాటడం. ప్రతీ స్తోత్రం శబ్దరూపంలో ఉన్న దేవీస్వరూపం. చదువుతూ ఉంటే అమ్మవారి రూపం కనులముందు కనబడుతూ ఉంటుంది.

స్తోత్రానికి గేయలక్షణంతో బాటు మంత్రలక్షణం కూడా ఉంటుంది. రాగం ఛందస్సు లయ ఉంటాయి. 

లలితాసహస్రం విష్ణుసహస్రం శ్రీసూక్తం మొ.గునవి వింటూంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శ్యామలాదండకం, మహిషాసురమర్దినిస్తోత్రం, శివతాండవస్తోత్రం లాంటివి వింటూంటే ఆ లయకు మెదడులో ప్రకంపనలు కలుగుతాయి. అర్ధం తెలియకపోయినా స్త్రోత్రం వింటూంటే ఆనందం కలుగుతుంది.

ఆదిశంకరులు శ్రీలలితా పంచరత్న స్తోత్రం చేస్తూ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు:

" ప్రాతః స్మరామి లలితా వదనారవిందం, 

  బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్,

  ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం,   

  మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ "

అమ్మవారి ముఖం పద్మంలా ఉందని, ముక్కుకి ముత్యపు ముక్కెర, చెవులకు మణులు పొదిగిన కుండలాలు, చెవులదాకా సాగిన పొడవైన కళ్ళు, చిరుమందహాసం, నుదుటిపై కస్తూరి తిలకం, అటువంటి అమ్మవారికి ఉదయాన్నే నమస్కరిస్తున్నాను అని. ఎంతటి చక్కని స్తుతి. చదువుతూ ఉంటే అమ్మవారు మురిసిపోతారు, అలా దర్శనమిస్తారు.

కామాక్షీదేవి ఎదురుగా కూర్చుని ఉంటే అమ్మవారిని చూస్తూ శ్యామశాస్త్రిగారు కీర్తనలు చేసేవారుట. 

ఎంతటి అద్భుత సంస్కృతి మనది. దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ