సమాజం మోహంలోకి లాగేస్తూంటూంది, జాగ్రత్తగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మోహనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 163 వ నామం.

" మోహనాశినీ " అంటే మోహానికి అడ్డుకట్ట. 

అందుబాటులో లేని కోరికను తీర్చుకోవాలనుకోవడాన్ని మోహం అంటారు. ఇది అధర్మము, చెడుపనులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒకతను మంచివాడే. ఓ చక్కని ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. ఓ ఖరీదయిన ప్రాంతంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనే కోరిక కలుగుతుంది. అది మోహంగా బలపడుతుంది. డబ్బు కోసం చెడ్డదారులు త్రొక్కడం మొదలుపెడతాడు. చిక్కుల్లో పడతాడు. కోరిక తీరదు కాని చిక్కులు మిగులుతాయి.

ఈ విషయిన్నే పరమాత్మ గీతలో ఇలా చెబుతారు:

" స్వభావజేన కౌంతేయ 

  నిబద్ధః స్వేన కర్మణా, 

  కర్తుం నేచ్ఛసి యన్మోహనాత్ 

  కరిష్య స్వవశో2పితత్ " 

              - భ.గీత 18:60

" కౌంతేయా, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మనుకూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు " అని.

ఓ కోరిక కలగగానే తన స్థాయి ఏమిటి, అది తనకు ఎంతవరకూ అవసరం అని ఆలోచనచేయాలి.‌ కాని అది అంత సులభం కాదు. అమ్మవారి అనుగ్రహం కావాలి.

శంకరులు ఓసారి కాశీలో ఉన్నప్పుడు ఓ వృద్ధుడు " వ్యాకరణ సూత్రాలు " వల్లెవేయడం చూసి ఆశ్చర్యపోయి " ఓ మందమతీ మరణానికి చేరువయిన నీకు మరణసమయంలో ఈ వ్యాకరణసూత్రాలు ముక్తిని ఇవ్వవు. గోవిందనామ స్మరణచేసుకుని తరించు " అని చెబుతూ అద్భుతమయిన జీవితార్ధాన్ని తెలియచేసే " భజగోవిందం ( మోహముద్గరం )" ని అనుగ్రహించారు మనవంటి సామాన్యులకు.

అమ్మవారి ధ్యాసలో గడిపితే ఇటువంటి మోహం నుంచి దూరం చేస్తుంది.

మోహం ఉచ్చులో పడకుండా చూడమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. భగవద్గీత లో భగవాన్ చెప్పారు అభ్యాసము,వైరాగ్యం అలవాటు చేసుకుంటే తప్ప మోహ భ్రాంతి నుండి బయట పడటం వీలు కాదని. మోక్షం పొందిన మహానుభావులందరికి.ఈ మార్గమే ఉపయోగపడింది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ