మనస్సు అదుపులో ఉంచుకోవడం కష్టమే కాని అసాధ్యం కాదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మనస్వినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 930 వ నామం.
" మనస్వినీ " అంటే స్వతంత్రమయిన మనస్సు గలది.
ఇది ఒక అద్భుతమైన నామం. మనస్సు అంతఃకరణాలలో మొదటిది. ఇది సంకల్పవికల్పాలు అంటే మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు రెండూ చేస్తుంది. చెడు ఆలోచనలు నిగ్రహించుకుంటే మంచిదే కాని అంత సులభం కాదు. ఎందుకంటే మన మనస్సు స్వతంత్రంగా ఉండదు ఎప్పుడూ. ఇతరుల, సమాజం యొక్క ప్రభావం ఉంటుంది దానిమీద.
ప్రతీ మనిషి ప్రతీరోజూ ఏ సమస్యలూ లేకుండా ఆనందంగా సాగాలనే కోరుకుంటాడు. మంచి ఆలోచనలే చేస్తూంటాడు కూడా. కాని అనుకోని సంఘటనలు జరుగుతూంటాయి. మనస్సు వికలమయి చెడు ఆలోచనలు మొదలవుతాయి.
ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" ఇంద్రియాణి మనో
బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే,
ఏతైర్విమోహయత్యేష
జ్ఞానమావృత్య దేహినమ్ "
- భ.గీత 3:40
" ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కామము నివసించు స్థానములు. వాటి ద్వారా కామము జీవుని జ్ఞానాన్ని కప్పేసి మోహింపచేస్తుంది " అన్నారు.
దీని అర్థం జీవుల ( మన ) మనస్సు స్వతంత్రం కాదు అంటే మన మాట వినదు అని.
కాని అమ్మవారు పొందినది లేదు, పొందవలసినది లేదు. అందుకని ఆవిడ మనస్సు స్వతంత్రంగానే ఉంటుంది.
మన మనస్సులు కూడా కొంతవరకయినా మన చేతుల్లో ఉండేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
అభ్యాసము,వైరాగ్యం అలవర చు కుంటే నే మనస్సు స్వాధీనం అవుతుందని భగవాన్ భగవద్గీతలో చెప్పాడు. ఒక వేళ అప్పటికే అదుపులోకి రాక పోతే గురువును ఆశ్రయించి ఆయనకు ఆత్మార్పణం చేసి అనుగ్రహం పొంది తే తప్పక సాధ్యం అవుతుందని లేటు పరమాచార్య చెప్పారు.
ReplyDelete