సుఖాసనంలో కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తే చాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సుఖారాధ్యా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 681వ నామం.

" సుఖారాధ్యా " అంటే సుఖముగా ఆరాధింపదగినది అని అర్థం.

అమ్మవారిని ఆరాధించడానికి, అనుగ్రహం పొందడానికి ఎక్కువ కష్టపడనక్కరలేదు. అంటే కఠినమయిన నియమాలేమీ ఉండవు. తెల్లవారుజామున చన్నీళ్ళస్నానం, రోజుల తరబడి ఉపవాసం/నిరాహారంగా ఉండడం, కష్టమయిన ఆసనంలో కూర్చోవడం/నిలబడడం లాంటివి చేయనక్కర్లేదని భావం. శరణాగతి అంటే నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నాకు అని అమ్మవారికి నమస్కరించుకుని నామజపం చేసుకుంటే చాలు అమ్మవారు అనుగ్రహిస్తారు.

కపిలమహర్షి తన తల్లికి తరించడానికని గీత భోదిస్తారు. అది " కపిలగీత " గా ప్రసిద్ధి చెందింది. అష్టాంగయోగంలో " సదా ఆసనజయం " అని ఒక విషయం వివరిస్తారు. శరీరాన్ని బాధపెట్టేవి, ధ్యానాన్ని ఆటంకపరిచేవి అయిన ఆసనాల్లో కూర్చోనక్కరలేదు సాధనకు. ధ్యానానికి శరీరం ఒక ముఖ్యమయిన సాధనం. శరీరం ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉండాలి. అప్పుడే సాధన వీలవుతుంది.

అదే పరమాత్మ గీత ( అధ్యాయం )లో తెలియచేసారు. " ఏకాంతంగా అంత ఎత్తు పల్లం కాని మెత్తటి ఆసనం మీద కూర్చుని కనుబొమల మధ్య దృష్టిని నిలిపి జపం చేసుకో " అని. అంత స్పష్టంగా, విపులంగా చెప్పారు.

రామకృష్ణ పరమహంస " కలికాలంలో సంసారచక్రంలో పడి తిరుగుతూన్న మనుషులు యజ్ఞయాగాదులు ఎక్కడ చేయగలరు. అందుకని సత్యం మాట్లాడడమే చేయగలిగినది/చేయదగినది " అని అంటారు.

అమ్మవారి నామజపం చేసుకుని " సుఖారాధ్య " అనుగ్రహం పొందుదాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ