అహంకారం నాశనహేతువు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" దక్షయజ్ఞవినాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 600 వ నామం. 

" దక్షయజ్ఞవినాశినీ " అంటే దక్షుడి యజ్ఞమును నాశనము చేసినది అని.

అమ్మవారిని దాక్షాయణీ అని ప్రార్థిస్తాం, దక్షుడి పుత్రిక కనుక. మరి తండ్రి యజ్ఞాన్ని నాశనం చేసినవారు అని కీర్తించడం ఏమిటి?. ఇక్కడ అర్ధం చేసుకోవలసినది దక్షుడులాంటి వారు చేసే యజ్ఞాలను నాశనం చేస్తారు అమ్మవారు అని.

దక్షుడు లోకకళ్యాణం కోసం యజ్ఞం తలపెట్టారు. బ్రహ్మ, విష్ణువు, ఋషులను అందరినీ ఆహ్వానించారు. శివుని మీద కోపంతో ఆహ్వానించలేదు. శివుడు దక్షుడి పుత్రిక అయిన సతీదేవి భర్త, అల్లుడు. పుత్రికని అల్లుడిని ఆహ్వానించకుండా అవమానపరిచేలా మరీ చేసారు దక్షుడు యజ్ఞాన్ని. ఇంకొకరికి అవమానం కలిగేలా చేసే యజ్ఞాలను ఎలా జరగనిస్తారు అమ్మవారు.

" అద్వేష్టా సర్వభూతానాం 

  మైత్రః కరుణ ఏవ చ,

  నిర్మమో నిరహంకారః

  సమదుఃఖసుఖః క్షమీ " 

             - భ.గీత 12:13

" ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు " అన్నారు పరమాత్మ.

" నిరహంకారః " అన్నారు పరమాత్మ ఇక్కడ. మామూలు మనుషులకే అహంకారం ఉండకూడదు. మరి యజ్ఞం చేసేవారికి ఉంటే ఎలా. అందుకే అటువంటి యజ్ఞాలను నాశనం చేసేస్తారు అమ్మవారు.

" నేను " అనే అహంకారాన్ని తొలగించి అనుగ్రహించమని వేడుకుందాం అమ్మవారిని.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ