శ్రీవారాహీదేవిని స్మరిస్తే తెలియని శత్రువులను కూడా నిర్వీర్యం చేసేస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
ఈరోజు శ్రీవారాహీదేవీ నవరాత్రులలో 9వ రోజు.
అమ్మవారు లలితాదేవి శ్రీశ్యామలాదేవిని మంత్రిణిగా, శ్రీవారాహీదేవిని రక్షణమంత్రిణిగా నియమించారు మన రక్షణ, బాగోగులు చూడడానికి.
అమ్మవారు పార్వతి, శ్యామలాదేవి సరస్వతి అయితే వారాహీదేవి లక్ష్మీదేవి.
శ్రీవారాహిదేవి అష్టోత్తర శతనామావళి లో కొన్ని నామాలు అత్యద్భుతంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి:
శత్రూణాం వాక్ స్తంభనకారిణీ
శత్రూణాం గతి స్తంభనకారిణీ
శత్రూణాం మతి స్తంభనకారిణీ
శత్రూణాం అక్షి స్తంభనకారిణీ
అమ్మవారిని శరణాగతి కోరితే శత్రువుల మాట, గమనం, బుద్ధి, కళ్ళను స్తంభింపచేసేస్తుంది. అంత రక్షణ ఇస్తుంది.
మూక శంకరులు ఆర్యాశతకంలో కామాక్షీ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు:
" తాడితరిపుపరిపీడన భయ
హరణ నిపుణహలముసలా,
క్రోడపతిభీషణముఖీ క్రీడసి
జగతి త్వమేవ కామాక్షి "
" శత్రుసైన్యమును దండించునది, శత్రుభయమును పోగొట్టుటలో సమర్ధములయిన హల ముసలములు గల వరాహముఖము గలిగిన నీవే జగమున క్రీడించుచున్నావు తల్లీ కామాక్షీదేవీ " అని.
శ్రీవారాహీదేవిని స్మరిస్తే తెలిసిన శత్రువులనే కాదు తెలియని శత్రువులను కూడా నిర్వీర్యం చేసేస్తారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మనకు అవసరమయినవన్నీ అనుగ్రహిస్తారు. నాస్తి సంశయం.
ఏతత్ సర్వం శ్రీవారాహీదేవీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment