చూపుడు వ్రేలు బ్రొటకన వ్రేలితో కలిస్తే జ్ఞానం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" జ్ఞానముద్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 979 వ నామం . 

" జ్ఞానముద్రా " అంటే జ్ఞానముద్రా స్వరూపురాలు. జ్ఞానముచే ఆనందము కలిగించునది. జ్ఞాన - చైతన్యమును, ముత్ - ఆనందమును, ద్రా - ఆవరించునది అని అర్ధం.

ఈ ముద్రనే చిన్ముద్ర, బ్రహ్మ ముద్ర, దక్షిణామూర్తి ముద్ర, అంగుష్టతర్జనీ యోగముద్ర అని కూడా అంటారు.

దీని వివరణ అద్భుతం. చిటికినవ్రేలు, ఉంగరం వ్రేలు, మధ్యవ్రేలు త్రిగుణాలు. చూపుడువ్రేలు జీవుడు. బ్రొటకనవ్రేలు బ్రహ్మ. జీవుడు త్రిగుణాలతోటే కలిసి ఉంటాడు సాధారణంగా. కాని బ్రహ్మతో కలిస్తే ఆనందమే. అంటే చూపుడువ్రేలు బ్రొటకనవ్రేలుతో కలిస్తే చిన్ముద్ర/జ్ఞానముద్ర.

" ఆనందం " ఏమిటి?. మనం ఆ ఊరు అంటే ఇష్టం, ఫలానా ఆయనంటే ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం అని అంటూంటాం. అంటే ఆ ఇష్టం అనేది మనకు ఆనందం ఇస్తూందని కదా. ఆ ఆనందం బ్రహ్మ స్వరూపం. ఆనందోబ్రహ్మ అంటూంటారు. 

సరస్వతీ రహస్యోపనిషత్తులో ఇలా తెలియచేసారు:

" అస్తి భాతి ప్రియం రూపం 

  నామ చేత్యంశపంచకమ్,. 

  ఆద్యత్రయం బ్రహ్మరూపం 

  జగద్రూపం తతో ద్వయమ్ "

అస్తి అంటే ఉనికి, భాతి అంటే ప్రకాశం, ప్రియం అంటే ఆనందం - ఈ మూడూ బ్రహ్మ రూపం, శాశ్వతం. రూపం నామం ప్రకృతి అంటే జీవుడు/మనం. మనకు రూపం, నామం కూడా మారిపోతూంటాయి. రూపం ఎలాగూ మారిపోతూనే ఉంటుంది వయస్సు పెరిగే కొలదీ. మరి నామం ఏమిటి?. చిన్నప్పుడు బాలుడా అని తరువాత యువకుడా, ముసలాడా అంటారు. ఇంకొన్నాళ్ళకి రూపమూ ఉండదు, నామమూ ఉండదు. నామరూపాలు అశాశ్వతం. 

ఈ అశాశ్వతం అంటే జీవుడు ఆంటే చూపుడువ్రేలు శాశ్వతము అయిన బ్రహ్మని అంటే బ్రొటకనవ్రేలుతో కలిస్తే చిన్ముద్ర/జ్ఞానముద్ర. అప్పుడు కలిగేది సత్ ( అస్తి ) చిత్ ( భాతి ) ఆనందం ( ప్రియం ). మానసిక ప్రశాంతత.

ఆ ముద్రని ఉపయోగించుకుని మానసిక ప్రశాంతతని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ