తొలిఏకాదశి - దక్షిణాయనం, పండుగలు ప్రారంభం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" అహంకారం బలం దర్పం 

  కామం క్రోధంచ సంశ్రితాః, 

  మమాత్మపరదేహేషు 

  ప్రద్విషంతో2భ్యసూయకాః " 

             - భ.గీత 16:18

" అహంకారం, అహంభావం, లోభం కోపం తో నిండినవారు దెయ్యంపట్టిన వారిలా తనలోనూ పరుల్లోనూ ఉన్న పరమాత్మని కూడా దూషిస్తారు " అని 

వ్యాసమహర్షి మానవుల సమస్త బాధలకి మూలం " లోభం " అని మహాభారతంలో తెలియపరిచారు. ఈ లోభమే/మోహమే జీవుణ్ణి మాయలో పడేసి నానా కష్టాలూ పడేలా చేస్తుంది. పాపపు భవంతులకు పునాది " లోభం ".

మరి దీనిప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో కూడా ఆయనే తెలియచేసారు:

" దమేన సదృశం ధర్మం 

  నాన్యం లోకేషు శుశృమః "

అంటే " పుణ్యానికి మూలం " దమం ". పుణ్యభవంతులకి పునాది " దమం ". దమం అంటే " ఇంద్రియనిగ్రహం ". స్పందించే ముందు ఒక్క క్షణం ఆలోచనచేస్తే ఏ కష్టాలు దరిచేరవు.

ఈ " దమం/ఇంద్రియనిగ్రహం " అంటే " 18 దోషాలు " లేకపోవడమే అని తెలియచేసారు వ్యాసర్షి. ఆ దోషాలు ఏమిటో చూద్దాం:

01. అనృతం : అబద్ధం ఆడడం.

02. పైసునం : పరదూషణ 

        అంటే చాడీలు చెప్పడం.

03. తృష్ణ : విషయాభిలాష

04. ప్రాతికూల్యం : అందరికీ 

        వ్యతిరేకంగా జీవించడం.

05. తమం : అజ్ఞానం, తమస్సు

06. అరతి : దేనియందు తృప్తి లేకపోవడం

07. లోకద్వేషం : జనులపట్లద్వేషం

08. అభిమానం : ఏదో ఒక  విషయంకోసం 

      పట్టుబట్టడం, అణుకువ లేకపోవడం.

09. వివాదం : ఏదో  ఒకనెపంతో జనులతో 

        కలహించడం.

10. ప్రాణిపీడనం : తన  దేహాన్ని పోషించడం    

       కోసం ఇంకో ప్రాణిని  పీడించడం

11. పరివాదం : పరులను దూషించడం

12. అతివాదం : అనవసరవాదం

13. పరితాపం : ఎల్లప్పుడూ  ఏదో ఒకదాని

      గురించి తలచుకుని బాధపడడం

14. అక్షమ : సహనం లేకపోవడం

15. అతురితి : చపలత్వం, 

      ధైర్యం లేకపోవడం

16. అసిద్ధి : ధర్మము, జ్ఞానం, 

       వైరాగ్యం కలగకపోవడం

17. పాతకృత్యం : కూడని 

        పనులు చెయ్యడం,     

        చెయ్యాలి అనిపించడం

18. హింస : హింస చెయ్యడం,చేయించడం, 

      ప్రేరేపించడం

వీటిలో 2. పైసునం కి 11. పరివాదం కి తేడా ఉంది. పైసునం పరోక్షం. అక్కడ లేనివాడి మీద చాడీలు చెప్పడం. పరివాదం ప్రత్యక్షం. ఎదురుకుండా ఉన్నవాడిని దూషించడం. ఎంతటి అద్భుత అవగాహన మహర్షికి. అదీ సనాతనధర్మం గొప్పదనం. 

ఈ 18 అవలక్షణాలు లేకపోతే ఇంద్రియనిగ్రహం ఉన్నట్లు అనుకోవాలి. అప్పుడు " ఎక్కువ " ఒడిదుడుకులు లేని ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవితం గడపవచ్చు. అన్ని కష్టాలకి, పాపాలకి ఈ లక్షణాలే కారణం.

అన్నీ లేకుండా ఉండగలగడం కష్టమే అయినా ( సమాజం ఉండనివ్వదు, మాయ చేస్తుంది ) కొన్ని తగ్గించుకున్నా కొన్ని కష్టాలనుండి దూరమవచ్చు.

అటువంటి శక్తిని, మనోనిగ్రహాన్ని ప్రసాదించి అనుగ్రహించమని పరమాత్మని వేడుకుందాం.

ఈరోజు పరమపవిత్రమయిన తొలిఏకాదశి. శుభాకాంక్షలు. 

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ