మనల్ని శివుడిగా చేయగలదు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" శంభుమోహినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 954 వ నామం.

" శంభుమోహినీ " అంటే శంభుని మోహ పెట్ఝునది అని అర్ధం. మోహంలో పడేయడం ఏమిటి అని ఆశ్చర్యం వేస్తుంది. కాని సృష్టి కొనసాగాలంటే అది ముఖ్యం. అమ్మవారు ధర్మార్ధకామమోక్షాలు నాలుగూ అనుగ్రహిస్తుంది. మూడవది కామం. అది కూడా అంటే ధర్మంతో కూడిన కామం జీవితం ఆనందమయం అవడానికి అత్యవసరం.

మూకశంకరులు " ఆర్యాశతకం " లో అమ్మవారు కామాక్షీదేవిని ఇలా వర్ణన చేసారు:

" పంచశరశాస్త్రబోధన 

  పరమాచార్యేణ దృష్టిపాతేన,

  కాంచీసీమ్ని కుమారీ కాచన 

  మోహయతి కామజేతారం "

              - ఆర్యాశతకం:5.

" కాముడిని జయించిన ఆయన ( శివుడి ) ని తనను మోహించేలా చేసుకున్న కాంచీపురం అమ్మాయి " అని అర్ధం. మన్మధుడే శివుణ్ణి ఏమీ చెయ్యలేక భస్మమయిపోయాడు. శివుడు కామానికి, మోహానికి అతీతుడు. మరి అటువంటి ఆయన్ని ఈవిడ ( తన సౌందర్యంతో, బాహ్య సౌందర్యం అనుకోకూడదు ) మోహింపచేసుకుందని భావం. ఎంత అద్భుత భావన.

దీనిలో ఓ ధర్మసూక్ష్మం ఉంది. జ్ఞాని అయిన శివుడిని జీవుడుగా ( కామార్ధిగా ) చేస్తుంది, జీవుడికి అద్భుత జ్నానాన్ని ఇచ్చి శివుడిని చేస్తుంది. ఘటనాఘటన సమర్ధురాలు. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే సామాన్యుడిని కూడా శివుడిని చేస్తుంది. జీవుడిని శివుడి ( జ్ఞాని ) ని చేయడం మన కళ్ళతో మనం చూసిన కంచి పరమాచార్యులే చక్కటి ఉదాహరణ.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అనుగ్రహించమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. వివరణ ఇచ్చారు. చాలా బాగుంది. ధన్యవాదము. 🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ