బిడియం కూడా అవసరమే, ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" లజ్జా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 740 వ నామం.
" లజ్జా " అంటే లజ్జా స్వరూపురాలు, ముడుచుకొనుట, బిడియం అని అర్ధం.
అధర్మం చేయడానికి వెనుకాడే గుణాన్ని లజ్జ అంటారు. ఇది ఉత్తమగుణం. అమ్మవారు లజ్జ రూపంలో ఉంటారు జీవులలో.
శ్రీరాముడు స్త్రీలతోటి ఋషులతోనూ సంభాషణలు తక్కువగా చేసేవారుట. వారు పొరపాటు పడి అసౌకర్యానికి లోనవకూడదని. రామో విగ్రహవాన్ ధర్మః.
మనిషి కూడా పగలంతా పనిచేసి రాత్రి లజ్జను పొందుతాడు.
ఓ అమ్మాయి వీధిలో మామూలుగా నడిచి వెడుతూన్నప్పుడు ఓ తెలిసిన పెద్దాయన ఎదురుపడితే ఆ అమ్మాయి వెంటనే తలవంచుకుని కొంగు సర్దుకుంటూ గబగబా దాటుకుని వెళ్ళిపోతుంది. అదే లజ్జ. అది అత్యవసరం ఉత్తమస్త్రీలకు.
చేసిన మంచిపనికి కొంచెం ఎక్కువగా మెచ్చుకుంటే కొందరు బిడియపడతారు. కొందరు సన్మానం చేస్తాం అని ఆహ్వానిస్తే " అబ్బే నేనేమీ అంత గొప్ప పని చేయలేదండి " అని బిడియపడతారు. చేసిన మంచిపనికి గుర్తింపు కోసం ప్రాకులాడరు కొందరు. అవి ఉత్తముల లక్షణాలు.
అందుకే అమ్మవారిని ఇలా ప్రార్ధిస్తాం:
" యా దేవీ సర్వభూతేషు
లజ్జా రూపేణ సంస్థితా,
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః "
అవసరమైన లజ్జను కూడా ప్రసాదించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment