కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటారనుకుంటాం, కాని అవే వీరిని వెతుక్కుంటూ వస్తాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సృష్టికర్త్రీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 264 వ నామం .

" సృష్టికర్త్రీ " అంటే జగన్నిర్మాణము చేయునది. అమ్మవారు చేసే సృష్టి ఎంతో అద్భుతంగానూ లోపరహితంగానూ ఉంటుంది. ఏ పువ్వు చూసినా దేని రూపం దానిదే. రంగు సువాసన ప్రత్యేకమే. ఏ పండు చూసినా రూపం, రంగు, రుచి వేరే.

పక్షి గుడ్డు పెట్టడానికి అద్భుతమయిన గూడు కట్టుకుంటుంది. పొదిగి పిల్లను చేసి పెరిగేదాకా ఆహారం తీసుకుని వచ్చి పెడుతుంది. ఎంత అద్భుత ప్రక్రియ.

ఇటువంటి అద్భుతాలే కాదు ఎన్నో వింతలూ చూస్తూంటాం. 

కుటుంబసభ్యుల దైనందిక అవసరాలు, వృద్ధుల అనారోగ్యసమస్యలతోనే కొంచెం కలవరంచెందుతూంటారు సాధారణంగా కుటుంబ యజమానులు. కాని ఆశ్చర్యంగా కొందరు కుక్కల్ని ( ఇప్పుడు పిల్లుల్ని కూడా ) పెంచుకుంటూంటారు. వాటిని బయటకు తీసుకుని వెళ్ళడం, స్నానం చేయించడం, తిండి తినిపించడం, వైద్యుడి దగ్గరకు తీసుకొని వెళ్ళడం కూడా శ్రద్ధగా చేస్తూంటారు. 

కుక్కలని పెంచుకోవడం ఆలనాపాలనా చూడటం ఏమాత్రం తప్పుకాదు. కాని వింత ఏమిటంటే వీరు ఆ కుక్కని తీసుకునిరారు. ఆ కుక్కే వీరి ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఈ కుక్క పూర్వజన్మలో వీరి కుటుంబసభ్యురాలు. ఋణానుబంధాన్ని తీర్చుకోవడానికి, సేవలు చేయించుకోవడానికి వీరి దగ్గరకు చేరుతుంది.

అమ్మవారి సృష్టిలో ఏర్పాట్లు అంత అద్భుతంగానూ, వింతగానూ కూడా ఉంటాయి. మన ఆనందం కోసం సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు అమ్మవారు. సదా కృతజ్ఞులుగా ఉండాలి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ