యజ్ఞము అంటే త్యాగం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా 

  పురోవాచ ప్రజాపతిః,

  అనేన ప్రసవిష్యధ్వమేష 

  వో2స్త్విష్టకామధుక్ " 

              - భ.గీత 3:10

" జీవులను, యజ్ఞాలను సృష్టించిన పరమాత్మ ఈ యజ్ఞాలచే సుఖాన్ని పొందండి, ఈ యజ్ఞములను ఆచరిస్తే మీకు ముక్తికి కావలసిన సర్వమునూ లభించును " అని మనకు తెలియచేసారు పరమాత్మ.

ఇక్కడ " యజ్ఞము " అంటే త్యాగము అని తెలియచేస్తూంది సనాతనధర్మం.

ప్రతీ జీవుడు త్యాగాన్ని చేస్తూ ఉండాలి అని తెలియచేస్తూంది సనాతనధర్మం. ఎంత అద్భుతం.

అగ్నిహోత్రం, యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరిస్తే దేవతలు సంతోషించి మనకు అవసరమయినవన్నీ అనుగ్రహిస్తారు అని అర్ధం.

యజ్ఞం వేరు, యాగం వేరు. పంచయజ్ఞాలు చెయ్యాలి జీవుడు తరించడానికి అని చెబుతున్నాయి శాస్త్రాలు. అవి 1. బ్రహ్మయజ్ఞం - శాస్త్రాలు, పురాణాలు, స్తోత్రాలు చదవడం 2. పితృయజ్ఞం - వారికి కనీసం తర్పణాలు వదలడం 3. దైవయజ్ఞం - హోమాలు, పూజలు చెయ్యడం 4. భూతయజ్ఞం - జంతువులకు పక్షులకు సేవ 5. మనుష్యయజ్ఞం - అతిధులకు భోజనాది సదుపాయలు కలిగించడం.

ఇప్పుడు యజ్ఞం అంటే ఏమిటి అన్నది స్పష్టంగా తెలుస్తుంది అందరికీ. ఇవి చేస్తే పరమాత్మ సంతోషిస్తారు అన్నారు. 

ఇతరదేశాల్లో మతం వేరు, విజ్ఞానం వేరు. ఆ రెండూ వేరు వేరు వ్యక్తులచేతుల్లో ఉంటాయి. మన దేశంలో అలాగకాదు. సనాతనధర్మాన్ని ఇచ్చిన ఋషులే అద్భుతమయిన విజ్ఞానవిషయాలనూ తెలియచేసారు - గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం మొ.గునవి మనకు ఇచ్చినది మన ఋషులే.

ఇతర మతాలలాగ కాక మన మతం విజ్ఞానంతో కూడుకున్నది. దీనికి సాటి అయినది లేదు, రాదు.

విదేశీ వనిత " అనిబిసెంట్ " అన్నారు " భారతదేశంలో హిందూమతం ఉందనికాదు, హిందూమతంలో భారతదేశం ఉంది " అని.

వివేకానందులు అన్నారు " నేను నా మతం యొక్క గొప్పదనాన్నే చెబుతాను, ఇతర మతాలను తక్కువచేసి మాట్లాడను. ఎందుకంటే అవన్నీ మా మతంలోంచి వచ్చినవే. ఏ విషయం మాట్లాడుకున్నా దాని మూలాలు మా సనాతనధర్మంలో కనబడతాయి " అని.

" యది హస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్ " అన్నారు వ్యాసర్షి మహాభారతంలో. అంటే " భారతంలో ఉన్నదే ఎక్కడా ఉంటుంది, భారతంలో లేనిది ఎక్కడా ఉండదు " అని.

మన సనాతనధర్మం లో ఉన్నదే ఎక్కడా ఉంటుంది, దీనిలో లేనిది ఎక్కడా ఉండదు.

ఎంత అద్భుత సంస్కృతి. దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ