అమ్మవారి సృష్టి ఎంత అద్భుతమో - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" అంతకాలే చ మామేవ
స్మరన్ముక్త్వా కలేవరం
యః ప్రయాతి స మద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః "
- భ.గీత 8:5
" అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈవిషయమున ఎట్టి సందేహము లేదు " అన్నారు పరమాత్మ.
అది అంత సులభం కాదు. త్రిగుణాల ప్రభావంనుంచి తప్పించుకోవడం కష్టం. పరీక్షలు పెడుతూనే ఉంటారు పరమాత్మ.
" బ్రతికినన్నాళ్ళు నీ భజన చేతును,
మరణసమయమున మరతునేమో " అంటారు నరసింహ శతకకర్త.
ప్రతీరోజూ దైవస్మరణ చేస్తూన్నా, మాయనుంచి తప్పించుకోలేరు. పోయే సమయంలో మనవణ్ణి " ఈరోజు శ్రీరామగాయత్రీజపం చేసావా, ఎంతచేసావు " అని అడగడు, వీధిలో కుక్క అరుస్తూంది చూడండ్రా అంటూ శరీరం విడుస్తాడు, మరుజన్మలో కుక్కగా పుడతాడు.
కుటుంబసభ్యుల దైనందిక అవసరాలు, వృద్ధుల అనారోగ్యసమస్యలతోనే కొంచెం కలవరంచెందుతూంటారు సాధారణంగా కుటుంబ యజమానులు. కాని ఆశ్చర్యంగా కొందరు కుక్కల్ని ( ఇప్పుడు పిల్లుల్ని కూడా ) పెంచుకుంటూంటారు. వాటిని బయటకు తీసుకుని వెళ్ళడం, స్నానం చేయించడం, తిండి తినిపించడం, వైద్యుడి దగ్గరకు తీసుకొని వెళ్ళడం కూడా శ్రద్ధగా చేస్తూంటారు.
కుక్కలని పెంచుకోవడం ఆలనాపాలనా చూడటం ఏమాత్రం తప్పుకాదు. కాని వింత ఏమిటంటే వీరు ఆ కుక్కని తీసుకునిరారు. ఆ కుక్కే వీరి ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఈ కుక్క పూర్వజన్మలో వీరి కుటుంబ సభ్యురాలు. ఋణానుబంధాన్ని తీర్చుకోవడానికి, సేవలు చేయించు కోవడానికి వీరి దగ్గరకు చేరుతుంది.
సృష్టి ఏర్పాట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో.
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment