ధర్మసంరక్షణ కోసం ఎందరో ప్రాణాలు అర్పించారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" యదా యదాహి ధర్మస్య 

  గ్లానిర్భవతి భారత,

  అభ్యుత్థానమధర్మస్య 

  తదాత్మానం సృజామ్యహం " 

                  - భ.గీత 4:7

ఎప్పుడయినా ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు ధర్మరక్షణకోసం వస్తూంటాను నేను అన్నారు పరమాత్మ. అంటే ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని సంహరించడానికే అనుకోనక్కరలేదు. 

ఆదిశంకరులు కంచిపరమాచార్యులు శృంగేరీపీఠాధిపతి రమణమహర్షి వివేకానందులు లాంటివారి కృషి పరమాత్మ ఏర్పాటే. 

వేదాలు కర్మకాండ, వేదాంగాలు ( ఉపనిషత్తులు మొ.గునవి ) జ్ఞానకాండ. ధనవ్యయంతో కూడుకున్న ద్రవ్యయజ్ఞాలకన్నా జ్ఞానయజ్ఞమే మేలు అన్నారు పరమాత్మ ( భ.గీత 4:33 ). 

ఆదిశంకరులు " రాబోయేది గడ్డుకాలం, జీవులు సంసారసాగరంలో మునిగిపోయి నానాబాధలూ పడుతూంటారు, దైవచింతనకు సమయం ఎక్కడుంటుంది. అటువంటివారు యాగాలు అవీ చేసే అవకాశమెక్కడిది. మరి సనాతనధర్మం ఎలా రక్షింపబడుతుంది. ఇన్నిరకాలుగా చింతనచేసి కర్మకాండకన్నా జ్ఞానకాండయే గొప్పది ( సులువు అంటే అర్ధంవేరేగా తీసుకోవచ్చు ) అనే సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెడితే రోజూ ఏదో ఒకసమయంలో జపమో శ్లోకపారాయణో శ్రవణమో చేసుకుని తరిస్తారు " అని భావించారు. దానికోసం శ్రమించారు. 

దేశమంతా కాలినడకన 3 సార్లు తిరిగి కర్మకాండ ఎవరు గొప్పదన్నా వారిని వాదనతో ఓడించి, మెప్పించి మన ఉన్నతికోసం శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం, విష్ణుసహస్రం బ్రహ్మసూత్రాలకి భాష్యాలు, ఎన్నో స్తోత్రాలు ఇచ్చారు. దానివల్లే ఇప్పుడు అధికజనులు మానసికప్రశాంతతో జీవితాలు గడపగలుగుతున్నారు. లేకపోతే ఎక్కడచూసినా అశాంతే కనపడుతూ ఉండేది. 

30 సం.లకే వివేకానందులు దేశదేశాలు తిరిగి ఆరోగ్యం క్షీణిస్తూన్నా లెక్కచేయక సనాతనధర్మం అంటే ఏమిటో వినని, తెలియని విదేశీయులని కూడా ఒప్పించి మెప్పించి " ఆహా సనాతనధర్మం ఎంత ఉత్కృష్టమయినది " అని పొగిడేలా చేసారు. 

మరి ఇదంతా పరమాత్మ సంకల్పం కాక మరేమిటి.

శ్రీరామా అనుకున్నా, స్తోత్రమో, అష్టకమో చదివినా విన్నా, ప్రవచనాలు విన్నా మానసికప్రశాంతత కలిగితీరుతుంది. నాస్తి సంశయం.

ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ