మనకు మనమే మిత్రులం, శతృవులం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" బంధురాత్మాత్మనస్తస్య   

  యేనాత్మైవాత్మనా జితః !

  అనాత్మనస్తు శత్రుత్వే     

  వర్తేతాత్మైవ శత్రువత్  " 

                  - భ.గీత 6:6

" మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు.  అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు " అన్నారు పరమాత్మ. 

అనగా జితేంద్రియునకు మనస్సు,  ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తిసిద్ధికై మిత్రునివలె సహకరిస్తాయి . జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు,శరీరము శత్రువులవలె ప్రవర్తించి  లక్ష్యసాధనకు అవరోధకములుగా నిలుస్తాయి.

ఎంత అద్భుత విషయం. మనస్సు ఇంద్రియములు అదుపులో ఉంచుకుంటే జీవితం ఆనందమయంగా సాగిపోతుందని, ఏ కష్టాలు దరిచేరవని ఎంత చక్కగా తెలియచేసారు పరమాత్మ.

వాల్మీకి రామాయణంలో ఓ అద్భుత ఘట్టం ఉంది.

" ఇంద్రియాణి పురాజిత్వా 

  జితం త్రిభువనం త్వయా 

  స్మరద్భిరివ తద్వైరం

  ఇంద్రియైరేవ నిర్జితః "

రావణుడు మరణించగానే మండోదరి అంటుంది రావణుడిని ఉద్దేశించి " ఇంద్రియాలు నీ అధీనంలో ఉంచుకొన్నప్పుడు మూడు లోకాలు నీ అధీనంలో ఉన్నాయి. ఇంద్రియనిగ్రహం కోల్పోయి పరస్త్రీని అపహరించి ఆ ఇంద్రియాల చేతిలోనే మరణించావు " అని.

ఇక్కడ తెలియచేసినది " ఇంద్రియాలే మిత్రులు, శతృవులు " అని.

" నీకు నువ్వే మిత్రుడు, శతృవు " అని వేల సంవత్సరముల క్రితమే చెప్పిన సత్యం ఎప్పటికీ ఇంకొన్ని వేల సంవత్సరముల తరువాత అయినా అక్షరసత్యం.

అదీ మన వాజ్మయం విశిష్టత.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ