పిరికితనం వదిలేయాలి, ఉత్సాహం తెచ్చుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" క్లైబ్యం మాస్మగమః 

  పార్ధనైతత్త్వయ్యుపపద్యతే,

  క్షుద్రం హృదయదౌర్బల్యం 

  త్యక్త్వోత్తిష్ట పరంతప " 

                 - భ.గీత 2:3 

" ఏమి చేయాలో తెలియటంలేదు, నువ్వే దిక్కు. ఏమి చేయాలో చెప్పు " అంటాడు అర్జునుడు పరమాత్మతో. " ముందు నిరాశ ను వదిలేయ్, ఉత్సాహం తెచ్చుకో " అంటారు పరమాత్మ. ఇక్కడ స్వామి క్లైబ్యం అన్నారు. అంటే నపుంసకత్వం. 

సుందరకాండలో హనుమ ఇలా అనుకుంటారు:

" అనిర్వేదశ్శ్రేయోమూలం

  అనిర్వేదః పరంసుఖం,

  అనిర్వేదోహి సతతం

  సర్వార్ధేషు ప్రవర్తకః "

ఉత్సాహమే సర్వసంపదలకు, సుఖాలకు మూలం. సదా ఉత్సాహంగా ఉంటే అన్ని కోరికలు నెరవేరుతాయి.

మొత్తం లంకంతా వెదికినా సీతమ్మ కనబడకపోవడంతో హనుమ కొంచెం కలవరబడ్డారు. అప్పుడు ఇలా అనుకుంటారు. ఉత్సహమే మనిషికి ఊపిరి. నిరుత్సాహం ఎప్పుడూ పనికిరాదు.

" ఉద్యమః సాహసం ధైర్యం 

  బుద్ధిః శక్తిః పరాక్రమః 

  షడేతే యత్ర వర్తంతే 

  తత్ర దేవ సహాయకృత్ " 

          - సుభాషిత రత్నాకరం 

ఉద్యమః అంటే గట్టి ప్రయత్నాలు. ప్రయత్నాలు శ్రద్ధగా, గట్టిగా, ఉత్సాహంగా చేయాలి. అప్పుడు దేవతలు కూడా సహాయం చేస్తారు. నమ్మకం కూడా ముఖ్యం. అవుతుందేమిటిలే అనే అపనమ్మకంతో చేసే పనులను " అసత్కర్మలు " అంటారు.

ఉత్సాహంగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. క్రొత్త క్రొత్త మంచి ఆలోచనలు వస్తాయి. దైవకృప తోడయి కష్టమైన పనులయినా సులభంగా ఆశ్చర్యకరంగా పూర్తవుతూంటాయి. సీతమ్మ జాడ హనుమకు అలానే తెలిసింది.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. రామసుదర్శన రావు బొడ్డపాటిAugust 4, 2024 at 9:19 PM

    చాలా చక్కగా విశదీకరించారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ