అన్నంని నిందించకూడదు, గౌరవించాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏

" అన్నం న నింద్యాత్

  అన్నం నపరిచక్షీత "

         - తైత్తిరీయ ఉపనిషత్తు

అన్నం ని నిందించకూడదు అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. జీవుడికి శక్తిని తేజస్సుని ఇస్తూన్నది బ్రహ్మం కదా. మరి మనం తినే తిండే కదా మనకు శక్తిని తేజస్సుని ఇస్తూన్నది. అందుకే ఉపనిషత్తులు " అన్నం పరబ్రహ్మ స్వరూపం " అని తెలియచేస్తున్నాయి. 

అందుకే మన సనాతనధర్మం ఏ తినుబండారాన్నైనా పరమాత్మకి నివేదించి తినమన్నారు. అప్పుడు అది ప్రసాదం అవుతుంది, ప్రత్యేక రుచి వస్తుంది. ప్రసాదంలో మనం లోపాలు వెదకం. అలాగే చిన్నప్పటినుంచే పిల్లలకు అన్నం మీద భక్తిని గౌరవాన్ని అలవాటుచెయ్యాలి. దేనినైనా ఇష్టంగా తింటే వంటికి పడుతుంది లేకపోతే నిరుపయోగమవుతుంది.

మా రెండో అన్నయ్యతో సాధారణంగా భోజనం చేసేవారం కాదు పిల్లలం. ఇంట్లో రకరకాల సైజుల పేకబెత్తాలు ఉండేవి. వాటిని ఎక్కువగానే వాడేవారు మా అన్నయ్య. అతని నియమం ప్రకారం కాళ్ళు కడుగుకుని విస్తరిముందు కూర్చుంటే కాళ్ళు ఆరేలోపు భోజనం అయిపోవాలి. భోజనం చేస్తూ గట్టిగా మాట్లాడినా, నవ్వినా, కామెంట్స్ చేసినా పేకబెత్తం తొడమీద నాట్యం చేసేది, వాత ( పట్టు పొట్టిలాగు కదా ) స్ఫష్టంగా తేలేది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ ఇంట్లో భోజనం 5/10 నిముషాలే. భోజనసమయంలో ఎక్కువ మాటలు ఉండవు.

శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు తనభవనానికి వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని శ్రీకృష్ణుడిని ఆహ్వానించినా వెళ్ళకుండా విదురుడి ఇంట్లో బసచేస్తారు. ఆయన విదురుడికి చెప్పినది ఎక్కడైనా భోజనం చేసేటప్పుడు వారి మనస్తత్వం, ఆ అన్నాన్ని వారు ఎలా సంపాదించారు అన్నది తెలుసుకుని చేయాలి అని. అందుకే పెద్దవారు అందరి ఇళ్ళలోనూ భోజనాలు చెయ్యరు. 

వండేవారి మనస్సు కూడా ప్రశాంతంగా భక్తిభావంతో నిండి ఉండాలి. అప్పుడే వండినది ప్రసాదం అవుతుంది, ఆరోగ్యాన్నిస్తుంది. 

ఈమధ్యన అలా జాగ్రత్త పడకుండా భోజనాలు చేసి పరువు, వేలకోట్లధనం పోగొట్టుకున్నవారి గురించి విన్నాం/చదివాం.

తెలియనివారి ఇళ్ళలో భోజనాలు చేయకూడదు. కాని పేదవారికోసం సామూహిక అన్నదానాలు జరిగేచోట పవిత్రత ఉంటుంది.

మహాలయపక్షాలలో చెసే అన్నదానం మహా పవిత్రం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ