అమ్మవారు తలచుకుంటే చాలు మురిసిపోతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నామపారాయణప్రీతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 732 వ నామం.

" నామపారాయణప్రీతా " అంటే నామపారాయణముచే సంతోషించునది. అమ్మవారి నామాలు జపం చేసుకుంటే చాలు సంతోషించి అనుగ్రహిస్తారు.

" యజ్ఞానాం జప యజ్ఞో2స్మి ( భ.గీత 10:25 )" - యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను అన్నారు పరమాత్మ. జపానికి అంత శక్తి.

త్యాగయ్య 96 కోట్ల రామజపం చేసారు, రామదాసు 13 కోట్ల శ్రీరామ జయరామ జయజయ రామ జపం చేసారు. ధృవుడు నమో భగవతే వాసుదేవాయ, ప్రహ్లాదుడు నమో నారాయణాయ జపాలు చేసారు. చిరస్మరణీయులు అయారు.

దీనిలో ఓ ధర్మసూక్ష్మం ఉంది.

" యస్య దేవే పరాభక్తిః

  యధా దేవే తధా గురౌ " 

            - కఠోపనిషద్

" ఏ దేవి అనుగ్రహం కోసం జపం చేస్తున్నామో ఆ దేవిమీద అఖండభక్తి ఉండాలి. అంతే భక్తి గురువుమీద ఉండాలి " అని కఠోపనిషద్ తెలియచేస్తూంది.

కబీర్ దాసు కాశీలో ఉండేవారు. ఆయనకు శ్రీరాముడు అంటే అపరిమితమైన భక్తి, నమ్మకం. రామజపం పారాయణ చేయాలని, చేసి తరించాలని కోరిక. 

కాశీలోనే ఉన్న రామానంద అనే రామభక్తుడిని రామనామం ఉపదేశం చేయమని కోరారు. ఆయన అన్యమతస్తులకి చేయలేనని సున్నితంగా తిరస్కరించారు.

ఎందరో రామభక్తులని, పండితులని కలిసాడు, బ్రతిమాలాడు. ఎవరూ కనికరించలేదు.

ఓరోజు ఉదయాన్నే సూర్యుడు ఇంకా ఉదయించలేదు. రామభక్తుడు రామానంద గంగలో స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. కొద్దిగా చీకటిగానే ఉంది. ఆ సమయంలో కబీర్ ఓ చెట్టుచాటునుంచి హఠాత్తుగా వచ్చి రామానందగారి కాళ్ళకు నమస్కరించబోయాడు. రామానందగారు " రామ రామ " అని వెనక్కు ఉరికారు.

కబీర్ " చాలు గురువుగారూ. ఇదే మీ రామనామ ఉపదేశంగా స్వీకరిస్తున్నాను " అని నమస్కారం చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. రామజపం నిరంతరం పారాయణ చేసి శ్రీరామ సాక్షాత్కారం పొందారు.

కారణజన్ముడు. సంకల్పంతో పాటు దేముడిమీదే కాదు, గురువుమీద కూడా అచంచలమైన విశ్వాసం, గౌరవం, భక్తి ఉండాలి. అప్పుడు ఏదీ అసాధ్యంకాదు.

అమ్మవారి నామస్మరణ చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుదాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ