కలికాలంలో భగవన్నామస్మరణ చాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" కలికల్మషనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 555 వ నామం .

" కలికల్మషనాశినీ " అంటే కలికాలమందలి పాపములను పోగొట్టునది అని అర్ధం.

" కల్యంతే కలహం కుర్వన్ యశ్మిన్ కలిః " - " కలికాలం ఎప్పుడూ కలహాలతో గడుస్తూ ఉంటుంది " అని భావం. కలహాలు దేనికి?. ద్వేషం అసూయ జీవులలో పెరిగిపోవడం వలన.

ఈ కలి కలియుగంలోనే ఉంటారు అనుకోకూడదు. ధర్మంతో నిండి ఉన్న సత్యయుగంలో కూడా ఉన్నాడు. నలదమయంతుల కధ మనం చదివేయున్నాం. త్రేతాయుగంలో రావణకుంభకర్ణులు, ద్వాపరంలో దుర్యోధనాదులు కలిపురుషులే. ఇప్పటి కలియుగంలో కూడా ధర్మపరులు ఉంటారు. 

వ్యాసర్షి మహాభాగవతంలో ఇలా అన్నారు:

" యత్ఫలం నాస్తి తపసా 

  న యోగేన సమాధినా 

  తత్ఫలం లభతే సంయక్ 

  కలౌ కేశవకీర్తనాత్ "

ఇతర యుగాలలో తపస్సు యోగం సమాధితో ఏ ఫలాన్ని పొందుతారో ఆ ఫలాన్ని కలియుగంలో కేవలం కేశవనామ కీర్తనతోనే లభించేస్తుంది. 

" యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ.గీత 10:25 ) అన్నారు పరమాత్మ గీతలో. అంటే కలియుగంలో భగవన్నామ స్మరణ చాలు తరించడానికి.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఈ కలిప్రభావ లక్షణాలు మనమీద పడకుండా అనుగ్రహిస్తారు అమ్మవారు. 

అమ్మవారి నామజపం చేసుకుని తరిద్దాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ