తనను నమ్ముకున్న భక్తులను అమ్మవారు వదిలేయరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సమస్తభక్తసుఖదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 502 వ నామం 

" సమస్తభక్తసుఖదా " అంటే భక్తులందరికీ సుఖములను ఇచ్చునది అని అర్ధం.

తనను నమ్ముకున్న భక్తులకు సుఖాన్ని, కీర్తిని, ముక్తిని ప్రసాదించకుండా ఎలా ఉంటారు అమ్మవారు.

ఆదిశంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:

" న మోక్షస్యాకాంక్షా న చ   

  విభవ వాంఛా2పి చ న మే  

  న విజ్ఞానా2పేక్షా శశిముఖి  

  సుఖేచ్చా2పి న పునః,

  అతస్త్వాం సంయాచే జనని  

  జననం యాతు మమవై  

  మృడానీ రుద్రాణీ

  శివ శివ భవానీతి జపతః "

" నాకు మోక్షం వద్దు. వైభవంమీద కోరిక లేదు. విజ్ఞానం మీద ఆపేక్ష లేదు. తల్లీ నాకు సుఖపడదామన్న కోరిక కూడా లేదు. నేనేమి కోరుకుంటున్నానో తెలుసా?. నా జన్మ అంతా నీ జపంతో జరిగిపోతే చాలు " అని వేడుకున్నారు శంకరులు.

అటువంటి నిష్కామభక్తులు అవడం వలననే శంకరులు సనాతనధర్మ పరిరక్షకులుగా, కారణజన్ములుగా నేటికీ పూజింపబడుతున్నారు.

కుంతి పాండవుల పరిస్థితి చూసి బాధపడుతూంటే పరమాత్మ " అత్తా, కాలప్రభావాన్ని ఎవరూ తప్పించుకోలేరు, నన్ను నమ్ము, మీకూ మంచిరోజులు వస్తాయి, పాండవులూ రాజ్యాలేలుతారు " అనడంతో కుంతి మహదానందపడుతుంది.

" అనన్యాశ్చింతయంతో మాం......భ.గీత 9:22 " - అన్నారు పరమాత్మ గీతలో అందుకే.

తనను నమ్ముకున్న భక్తులను వదిలేయదు అమ్మవారు. సందేహం అక్కరలేదు.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మన బాగోగులు అన్నీ అమ్మవారే చూసుకుంటారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ