స్వధర్మమే ఎల్లవేళలా శ్రేయం పరధర్మం కన్నా - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మాత్ స్వనుష్ఠితాత్,
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః "
- భ.గీత 3:35
" పరధర్మమును చక్కగా నిర్వహించుటకన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది. దానిని పాటించుటకన్నను స్వధర్మపాలనమునందు నాశనమును పొందుటయైనను ఉత్తమమైనది " అన్నారు పరమాత్మ.
కొద్దిగా లోపాలున్నా స్వధర్మమే మేలు, పరధర్మం భయంకరమైనది అన్నారు పరమాత్మ గీతలో.
దేశకాల వర్ణాశ్రమాలను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని శాస్త్రాలే చెబుతున్నాయి. ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్న ఒక ధర్మాన్ని పట్టుకుని విమర్శిస్తూ సనాతనధర్మం అంతా చెడ్డది అనుకోవడం దేనికి. ఇప్పటి పరిస్థితులకు సరిపోయేలా కొద్దిగా మార్పు చేసుకోవడమే నయం కదా. చేసుకుంటున్నాం కూడా - ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి బాల్యవివాహాలు వద్దనుకున్నాం, సతీసహగమనం ఆపేశాం.
ఇతరమతాలన్నీ ఎప్పుడు వాడుకలోకి వచ్చాయో అందరికీ తెలుసు. సనాతనధర్మం ఎప్పటినుంచి ఉందో ఎవరూ చెప్పలేరు. అంటే ఈ ఇతరమతాలన్నీ సనాతనధర్మం బిడ్డలే. ఎవరు కాదన్నా ఒప్పుకోకున్నా ఇది సత్యం. తల్లిలో ఏదయినా లోపం ఉంటే లోపానిని ప్రక్కనబెట్టి మంచితో ఎదరికి సాగాలి కాని తల్లిని మార్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
రావణుడు మరణించాక లక్ష్మణుడు లంకలోని అద్భుత భవనాలను, ఉద్యానవనాలను చూసి అంటాడు రాముడితో " ఎంత అందంగా ఉంది లంక అన్నయ్యా " అని. రాముడు " నాకు ఏమీ అలా అనిపించటంలేదు . ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి " అని అంటారు. అంటే తల్లి, పుట్టిన ప్రదేశం స్వర్గాని కన్నా ఎక్కువ అని.
అదీ మన సంస్కృతి.
మన సనాతన ధర్మాన్ని కించపరచడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిది. అది వారి మొహమ్మీదే పడుతుంది.
తస్మాత్ జాగ్రత.
హమారా సనాతనధర్మ మహాన్.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment