మరుగున పడిన గీతను కృష్ణుడు మళ్ళీ చెప్పారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" ఇమం వివస్వతే యోగం 

  ప్రోక్తవానహమవ్యయం, 

  వివస్వాన్మనవే ప్రాహ 

  మనురిక్ష్వాకవే2బ్రవీత్ " 

             - భ.గీత 4:1 

" సనాతనమూ నాశరహితమూ అయిన ఈయోగాన్ని మొదట సూర్యుడికి చెప్పాను. దానిని మనువు ఆధ్యయనం చేసి ఇక్ష్వాకునికి బోధించాడు. తరువాత కాలంలో రాజర్షులు అందుకుని తరువాత తరాలకి అందించారు. తరువాత మరుగున పడిపోయింది. ఇప్పుడు నీకు మళ్ళీ చెబుతున్నాను " అన్నారు పరమాత్మ.

అర్జునుడు ఆశ్చర్యపోతాడు. సనాతనుడు అయిన సూర్యుడు ఎక్కడ, నిన్న మొన్న పుట్టి తనతో పెరిగిన కృష్ణుడు ఎక్కడ అని. అదే అడుగుతాడు ఇలా:

" అపరం భవతో జన్మ 

  పరం జన్మ వివస్వతః, 

  కధమేతద్విజానీయాం 

  త్వమాదౌ ప్రోక్తవా నితి " 

             ‌ - ‌ భ.గీత 4: 4.

నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటీ అని. ఆశ్చర్యంగా ఉంది అంటాడు అర్జునుడు.

సందేహనివృత్తి. ప్రశ్నలు, సమాధానాలు వాటిలోనే. వేల సం.ల తరువాత కలగబోయే సందేహాలకు కూడా అక్కడికక్కడే ప్రశ్నలు సమాధానాల రూపంలో విషయాలను తెలియచేసారు మన ఋషులు. అందుకే మన వాజ్మయం నిత్యనూతనం.

రామాయణం, మహాభారతం, భాగవతాలు అద్భుత వాజ్మయం. బాల్యం నుంచే వీటిని పిల్లలచేత చదివిస్తే పిల్లలకు ఎన్నో సందేహాలు తీరి జీవితసత్యాలు తెలిసి వస్తాయి, పిల్లలు బాధ్యతగల పౌరులుగా తయారవుతారు. దేశం సర్వతోముఖాభివృద్ధి చెంది గౌరవించబడుతుంది. అందుకే అవి అంత నిత్యనూతనం. వాటికి సాటి లేదు, ఇకపై రాదు. సంశయం నాస్తి.

భీష్ముడు వివాహం చేసుకోబోనని తండ్రికి మాట ఇచ్చారు. తన గురువు, విష్ణువు అవతారం అయిన పరశురాముడు " వివాహం చేసుకో, నేను చెబుతున్నాను, పరవాలేదు " అన్నా వినలేదు. ఆయనతో యుద్ధానికి కూడా సిద్ధపడ్డారు. అదీ మన ఆర్షధర్మ పవిత్రత.

హమారా ఆర్షధర్మం మహాన్.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ